ఏపీలో అధికార వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులు ఇతర పార్టీల్లో చేరేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు టీడీపీ, జనసేన పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. తాజాగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్ నగరంలోని ఆయన నివాసానికి బాలశైరి వెళ్లారు.
గత 2019లో జరిగిన ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసిన బాలశౌరి.. ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే, పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తితో ఆయన ఇటీవల వైకాపాకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన మరుసటి రోజే జనసేనలో చేరబోతున్నట్టు ఆయన ప్రకటించారు.
అయితే, ఆయన ఇంకా పార్టీలో చేరలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన చేరిక, ఇతర రాజకీయ అంశాలతో వారిద్దరు చర్చించినట్టు సమాచారం. కాగా, వైకాపా నేతలు పేర్ని నాని, జోగి రమేశ్‌లతో బాలశౌరికి విభేదాలు ఉన్నాయి.