సగం రోజులు గడిచిపోయాయ్... ఇక సమరమే అంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు!
విజయవాడ : వైసీపీ ఎమ్మెల్యేలు ఇక రణం ప్రారంభించారు. తమ నియోజకవర్గ నిధుల కోసం ఏపీ విపక్ష ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబును కలిశారు. ప్రతిపక్షంలో ఉండటం వల్ల తాము వివక్షకు గురయ్యామని, తమ ని
విజయవాడ : వైసీపీ ఎమ్మెల్యేలు ఇక రణం ప్రారంభించారు. తమ నియోజకవర్గ నిధుల కోసం ఏపీ విపక్ష ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబును కలిశారు. ప్రతిపక్షంలో ఉండటం వల్ల తాము వివక్షకు గురయ్యామని, తమ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులివ్వాలని నేరుగా సీఎంనే డిమాండు చేసేందుకు సిద్ధమయ్యారు. విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయంలో అపాయింట్‌మెంట్ తీసుకుని వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును కలిశారు.
ఇప్పటికే సగం పదవీ కాలం పూర్తయిపోయిందని, ఇక ఇప్పటికీ నియోజకవర్గాలను అభివృద్ధి చేయకపోతే, ప్రజలు తమను ఉపేక్షించరని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లోగా తమ పదవీ కాలం పూర్తయ్యే లోగా అభివృద్ధిపై తాము దృష్టి సారించక తప్పదని సెలవిచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఏపీ సీఎం... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయడానికే తాను కృతనిశ్చయంతో ఉన్నానని తెలిపారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యేలు అమరావతిలో వెలగపూడి తాత్కాలిక సచివాలయాన్నిసందర్శించారు. అక్కడి పనులు, నిర్మాణాలను పరిశీలించారు.