రోజాపై ఇంటలిజెన్స్ రిపోర్టులున్నాయట... అందుకే అడ్డుకున్నారట.. రోజా మానవబాంబా? (వీడియో)
పార్లమెంటేరియన్ల మహిళా సదస్సుకు ఆహ్వానం పంపడంతో.. ఆ సదస్సుకు వచ్చిన వైకాపా ఎమ్మెల్యే రోజాను గన్నవరం వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడంపై టీడీపీ మహిళా నేతలు వివరణ ఇచ్చుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజ
పార్లమెంటేరియన్ల మహిళా సదస్సుకు ఆహ్వానం పంపడంతో.. ఆ సదస్సుకు వచ్చిన వైకాపా ఎమ్మెల్యే రోజాను గన్నవరం వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడంపై టీడీపీ మహిళా నేతలు వివరణ ఇచ్చుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఇంటెలిజెన్స్ రిపోర్టులున్నాయి.. అందుకే అడ్డుకున్నామని టీడీపీ ఎమ్మెల్యే అనిత పేర్కొన్నారు. పార్లమెంటేరియన్ల మహిళా సదస్సుకు ఆహ్వానం పంపిన తర్వాత ఆమెను అడ్డుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
అయితే ఎయిర్‌పోర్టులో పోలీసులతో రోజా వాగ్వాదానికి దిగడంపై టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మహిళా ఎమ్మెల్యేగా రోజాకు ఆహ్వానం పంపాం కానీ ఇంటెలిజెన్స్ రిపోర్టులు ఉన్నాయి.. అందుకే అడ్డుకున్నామని ఎమ్మెల్యే అనిత చెప్పుకొచ్చారు. గొడవలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అనిత ఆగ్రహించారు. మరో మహిళా ఎమ్మెల్యే ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ మహిళలకు టీడీపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు.
చంద్రబాబు పేరు చెడగొట్టేందుకు సదస్సును అడ్డుకోవాలని చూస్తున్నారని, ఎమ్మెల్యే రోజావి చీప్ పాలిటిక్స్ అని ముళ్లపూడి రేణుక ఆరోపించారు. అయితే ఎయిర్‌పోర్టులో దలైలామా వెళ్తున్న సమయంలో ఆమెను కాసేపు ఆగాలని చెప్పామని.. ఆగకపోగా పోలీసులతో రోజా వాగ్వాదానికి దిగారని అందుకే అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పడం గమనార్హం. టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఇంటెలిజెన్స్ రిపోర్టులున్నాయి అందుకే అడ్డుకోవాల్సి వచ్చిందని చెప్తున్నారు.
కానీ రోజాను అడ్డుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందని వైకాపా నేతలు ఫైర్ అవుతున్నారు. ఇంటలిజెన్స్ రిపోర్టులున్నాయనేందుకు రోజా ఏమైనా మానవ బాంబా..? అంటూ ప్రశ్నించారు. రోజాను అవమానించే దిశగా ప్రతీసారి చంద్రబాబు సర్కారు ఇలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. మహిళా సదస్సులో రోజా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఆమెను అడ్డుకున్నట్లు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి.
</iframe