టీడీపీలోకి రోజా వస్తానంటే అభ్యంతరం లేదు... మంత్రి సునీత, ఏంటి సంగతి?
ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి చేరేటప్పుడు గతంలో చేసిన తప్పే మరోసారి చేయకూడదన్నది వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా గట్టిగా పాటిస్తున్నట్టు ఉన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్ వైసీపీ నేతలందరూ కలిసి రెండు రోజుల క్రితం నగరిలో జరిగిన విస్తృత
ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి చేరేటప్పుడు గతంలో చేసిన తప్పే మరోసారి చేయకూడదన్నది వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా గట్టిగా పాటిస్తున్నట్టు ఉన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్ వైసీపీ నేతలందరూ కలిసి రెండు రోజుల క్రితం నగరిలో జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వంపై అందరు కలిసి దుమ్మెత్తి పోశారు. రోజా నోరు తెరిస్తే ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. కాని ఎవ్వరూ ఊహించని విధంగా రోజా మాత్రం పెద్దగా ప్రభుత్వంపై గానీ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై గానీ ఎక్కడా కూడా నోరు జారలేదు.
ఇలా చేయడానికి కారణం కూడా లేకపోలేదు. అధికారంలో ఉన్న పార్టీ లోకి లేటైనా పరవాలేదు.. కాని చేరి తీరుతాను.. అన్నట్టుగా ఉంది రోజా వైఖరి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చేపట్టిన నవనిర్మాణ దీక్షలో కనిపించి వైసీపీ అధ్యక్షుడు జగన్ కు షాక్ ఇచ్చింది. దీనికి తోడు రోజా టీడీపీలోకి వస్తానంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలుగు దేశం పార్టీ ఎమెల్యే పరిటాల సునీత మొన్నీమధ్య స్పష్టం చేశారు. రోజా అనుచరులు మాత్రం వెంటనే టీడీపీలో చేరిపోదామని బలవంతం చేసినా రోజా మాత్రం ఇది సరైన సమయం కాదని కొద్దిగా ఓపిక పట్టండని, దానికి ఒక సమయం వస్తుందని చెప్పుకొచ్చినట్లు సమాచారం.