Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లోకేష్‌ సిమ్ కార్డులేని సెల్‌ఫోన్... కోడి చికెన్ షాప్ ముందుకెళ్లి తొడకొట్టింద‌నే డైలాగ్ గుర్తుకొస్తుంది : ఆర్కే.రోజా

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ సిమ్ కార్డు లేని సెల్‌ఫోన్‌లా ఉంటారనీ, ఆయనను చూస్తుంటే హీరో మహేష్ బాబు చిత్రంలోని ఓ డైలాగ్ గుర్తుకు వస్తుందని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా తనదైనశైలిల

Advertiesment
లోకేష్‌ సిమ్ కార్డులేని సెల్‌ఫోన్... కోడి చికెన్ షాప్ ముందుకెళ్లి తొడకొట్టింద‌నే డైలాగ్ గుర్తుకొస్తుంది : ఆర్కే.రోజా
, శుక్రవారం, 14 అక్టోబరు 2016 (15:53 IST)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ సిమ్ కార్డు లేని సెల్‌ఫోన్‌లా ఉంటారనీ, ఆయనను చూస్తుంటే హీరో మహేష్ బాబు చిత్రంలోని ఓ డైలాగ్ గుర్తుకు వస్తుందని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా తనదైనశైలిలో సెటైర్లు వేశారు. 
 
ఆమె శుక్రవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ ‘జ‌గ‌న్‌పై లోకేష్‌ త‌న స్థాయిని మించి వ్యాఖ్యలు చేస్తున్నాడు. లోకేష్‌ సిమ్ కార్డులేని సెల్‌ఫోన్‌లా ఉంటాడు. బిల్డ‌ప్ ఎక్కువ, విష‌యం త‌క్కువ‌. క‌నీసం మండ‌ల క‌మిటీని ఎలా నియ‌మిస్తారో కూడా తెలియ‌ని లోకేష్ టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శ‌ట‌. క‌నీసం వార్డు మెంబ‌రుగా కూడా గెల‌వ‌ని వాడివి.. నిన్ను చూసి జ‌గ‌న్ భ‌య‌ప‌డాలా?’ అని రోజా ఘాటుగా విమర్శించారు.
 
అంతేకాకుండా, హీరో మ‌హేష్‌బాబు సినిమా డైలాగ్ గుర్తుకొస్తోంది.. చికెన్ షాప్ ముందుకెళ్లి కోడి తొడకొట్టింద‌ట.. ఈ తీరులోనే టీడీపీ యువ‌నేత‌ లోకేష్ వైఖరి ఉంది' అని అన్నారు. ప్ర‌జ‌ల క‌ష్టాల‌పై పోరాడుతున్న త‌మ పార్టీ అధినేత‌ జ‌గ‌న్ ముందే లోకేష్‌ తొడ‌కొట్టే ప్ర‌యత్నం చేస్తున్నార‌ని ఆమె అన్నారు. 
 
ఇకపోతే.. ప్రధాని న‌రేంద్ర మోడీ, జనసేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అంద‌రూ క‌లిస్తే టీడీపీ గెలిచింద‌ని రోజా గుర్తు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు అధికారం కోల్పోతార‌ని ఆమె జోస్యం చెప్పారు. అసెంబ్లీ నుంచి త‌న‌ను అన్యాయంగా పంపించేశారని ఆమె అన్నారు. 'క‌మీష‌న్ల‌కు ముద్దుబిడ్డ చంద్ర‌బాబు' అని రోజా అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు - వెంకయ్యలు అవిభక్త కవలలు... రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు : ఆర్కే రోజా