వైకాపా నేత నారాయణ రెడ్డిని కేఈ కుటుంబీకులే హతమార్చారు : వైకాపా
కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్ చార్జి నారాయణరెడ్డిని హత మార్చింది డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబీకులేనని నారాయణరెడ్డి సోదరుడు ప్రదీప్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసుపై పోలీసులు సమగ్ర విచార
కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్ చార్జి నారాయణరెడ్డిని హత మార్చింది డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబీకులేనని నారాయణరెడ్డి సోదరుడు ప్రదీప్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసుపై పోలీసులు సమగ్ర విచారణ నిర్వహించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, ఈ హత్యను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని వైఎస్సార్సీపీ ఓ ప్రకటనలో పేర్కొంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కేఈలే పథకం ప్రకారం ఈ హత్య చేయించారని, ప్రజల మనసులను గెలుచుకోవడం టీడీపీకి చేతగావడం లేదని, గత మూడేళ్ల టీడీపీ అరాచకపాలనకు ఇది పరాకాష్ట అని మండిపడింది.
హత్యా రాజకీయాలకు టీడీపీ తెరలేపిందని, భయానక వాతావరణం సృష్టించి, హత్యలు చేయించి ప్రతిపక్షం నోరు మూయించేందుకు టీడీపీ సర్కార్ బరితెగించిందని వైఎస్సార్సీపీ ఆరోపించింది. నారాయణరెడ్డి హత్యతో ఏపీ రాక్షస పాలన ఉగ్రవాద స్థాయికి చేరిందని, ఈ హత్యకు నిరసనగా సోమవారం కర్నూలు జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నట్టు ఆ ప్రకటనలో తెలిపింది.