Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైజాగ్‌లో డ్రగ్స్.. తెలుగుదేశం -వైకాపాల మధ్య కార్టూన్ల యుద్ధం

Advertiesment
drugs capital

సెల్వి

, శనివారం, 23 మార్చి 2024 (20:13 IST)
drugs capital
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ చర్చల్లో వైజాగ్‌లో ఇటీవల పట్టుబడిన డ్రగ్స్ గురించే ప్రాధాన్యత వుంటోంది. ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీలు వాడుకుంటున్నట్లు అర్థమవుతుంది. ఏపీని డ్రగ్ క్యాపిటల్‌గా మార్చేశారనీ, డ్రగ్స్‌ వ్యాపారం వెనుక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతల హస్తం ఉందని టీడీపీ వర్గాలంటున్నాయి. 
 
సరుకులు తెచ్చినట్లు అనుమానిస్తున్న ప్రైవేట్ కంపెనీ వెనుక టీడీపీ, బీజేపీ నేతల బంధువుల హస్తం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. డ్రగ్స్ ఆపరేషన్ గురించి ఈ తీవ్రమైన రాజకీయ యుద్ధం మరింత వేడెక్కుతుండగా టీడీపీ, వైసీపీ పరస్పరం కార్టూన్ దాడి ప్రారంభించాయి. 
 
టీడీపీని తెలుగు డ్రగ్స్ పార్టీ అని వైసీపీ కార్టూన్లు చెబుతున్నాయి. ఈ కార్టూన్లలో చంద్రబాబు నాయుడు, లోకేష్, పురందేశ్వరి యానిమేషన్ వెర్షన్లు ఉన్నాయి. ఇక వైకాపా యువజన కొకైన్ పార్టీ అని, ఈ కార్టూన్లలో వైఎస్ జగన్, విజయసాయి రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డిల యానిమేషన్లు ఉన్నాయి.
 
దీనిని బట్టి తమ ప్రత్యర్థులపై నిందలు మోపడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు రెండు పార్టీలు నిజంగానే తహతహలాడుతున్నాయని స్పష్టంగా గమనించవచ్చు. మరి దీనివెనుక వాస్తవంగా ఎవరున్నారన్నది విచారణలో తేలాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళతో సన్నిహిత సంబంధం, ఆమె కుమార్తెపై అత్యాచారం చేసిన సీఐ