Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైయస్సార్‌ కంటి వెలుగు పథకం, అవ్వా తాతలకు ఉచితంగా ఆపరేషన్లు, కళ్లద్దాలు: సీఎం జగన్‌

వైయస్సార్‌ కంటి వెలుగు పథకం, అవ్వా తాతలకు ఉచితంగా ఆపరేషన్లు, కళ్లద్దాలు: సీఎం జగన్‌
, సోమవారం, 3 మే 2021 (20:51 IST)
రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తూ, పనులను వేగవంతం చేయాలి: సీఎం
ఇప్పటికే జ్యుడీషియల్‌ ప్రివ్యూ పూర్తి చేసుకుని, టెండర్లు నిర్వహించిన కాలేజీల్లో వెంటనే పనులు ప్రారంభం కావాలన్నారు సీఎం జగన్.

ఇంకా ఆయన ఏమన్నారంటే... ఉభయ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో మెడికల్‌ కాలేజీల కోసం భూసేకరణ, నిధుల కేటాయింపులో జాప్యం జరగకుండా జిల్లా కలెక్టర్‌లతో మాట్లాడండి. వైద్య రంగాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలి. దీనికి సంబంధించి నిధుల కొరత అనేది లేకుండా చూడాలి.
 
కాగా, ఇప్పటికే పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల, మచిలీపట్నం..  కాలేజీలకు సంబంధించి టెండర్లు అవార్డు అయ్యాయని, మిగిలిన 12 మెడికల్‌ కాలేజీలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఈ నెల 21వ తేదీ లోగా ప్రారంభమవుతుందని సమావేశంలో అధికారులు వెల్లడించారు.
 
వైయస్సార్‌ కంటి వెలుగు పథకం:
పథకంలో ఇప్పటి వరకు 66,17,613 మంది స్కూల్‌ పిల్లలకు పరీక్షలు నిర్వహించామని, వారిలో కంటి లోపాలు ఉన్నట్లు గుర్తించిన 293 పిల్లలకు ఆపరేషన్లు కూడా చేయించామన్న అధికారులు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 60,393 çస్కూళ్లను కంటి వెలుగు పథకంలో కవర్‌ చేశామని, కళ్ళద్దాలు అవసరమైన 1,58,227 మంది పిల్లలకు ఉచితంగా అద్దాలు పంపిణీ చేశామని అధికారుల వెల్లడి.

పథకం మూడో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 8,09,262 మంది అవ్వాతాతలకు కంటి పరీక్షలు చేశామని, వారిలో 3,90,479 మందికి ఉచితంగా కంటి అద్దాలు కూడా ఇచ్చామని, మరో 41,193 మందికి ఆపరేషన్లు కూడా చేయించగా ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతోందని సమావేశంలో అధికారులు వివరించారు.
 
కాగా, వైయస్సార్‌ కంటి వెలుగు కింద అవ్వాతాతలకు ఉచితంగా కళ్ల అద్దాల పంపిణీ చేయడంతో పాటు,, అవసరమైన వారికి ఆపరేషన్లు పూర్తి చేయాలని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ఇందులో ఎటువంటి జాప్యం జరగకూడదని, అధికారులు తప్పనిసరిగా దీనిపై దృష్టి పెట్టాలని ఆయన నిర్దేశించారు.
 
డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఏపీఎంఎస్‌ఐడీసీ వైస్‌ ఛైర్మన్, ఎండీ విజయరామరాజు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ మల్లికార్జున్‌తో పాటు, పలువురు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో మూడు వ్యాక్సిన్లు, బారులు తీరుతున్న ప్రజలు