Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్కే బీచ్‌లో విద్యార్థి ఉద్యమానికి రాజకీయ పక్షాలే ప్రత్యర్థులు కానున్నారా?

తమిళనాడులో మెరీనా బీచ్‌లో జరిగిన జల్లికట్టు ఉద్యమంతో స్ఫూర్తి పొందిన ఏపీ యువతీయువకులు రాష్ట్ర ప్రయోజనాలకు అత్యవసరమైన ప్రత్యేక హోదా కోసం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో కూడా మౌన ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమానికి ప్లాన్ చేసింది విద్యార

ఆర్కే బీచ్‌లో విద్యార్థి ఉద్యమానికి రాజకీయ పక్షాలే ప్రత్యర్థులు కానున్నారా?
హైదరాబాద్ , బుధవారం, 25 జనవరి 2017 (04:46 IST)
తమిళనాడులో మెరీనా బీచ్‌లో జరిగిన జల్లికట్టు ఉద్యమంతో స్ఫూర్తి పొందిన ఏపీ యువతీయువకులు రాష్ట్ర ప్రయోజనాలకు అత్యవసరమైన ప్రత్యేక హోదా కోసం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో కూడా మౌన ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమానికి ప్లాన్ చేసింది విద్యార్థులే. ఇది పూర్తిగా రాజకీయాలకు భిన్నమైంది. అదే విధంగా ఇది కొనసాగినట్లయితే జల్లికట్టు స్థాయిలో ఉద్యమం తీవ్రరూపం దాల్చేదని పరిశీలకులు అంటున్నారు. 

కానీ యువత ఆర్కే బీచ్‌లో మౌన ప్రదర్శనకు అలా పిలుపునిచ్చారో లేదో.. ఆ వెనువెంటనే రాజకీయనేతలు ఎంటరైపోయారు. ముందుగా జనసేన, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా బరిలో దిగిపోయాయి. విద్యార్థులు మౌన ప్రదర్శనకు పిలుపునివ్వగానే వైఎస్సార్సీపీ ప్రకటన చేస్తూ అదే రోజు అంటే జనవరి 26న విశాఖ ఆర్కే బీచ్‌లో క్యాండిల్స్‌తో నిరసన చేపడతామని పేర్కొంది. కానీ తమ ఉద్యమాన్ని రాజకీయమయం చేస్తున్నారంటూ సోషల్ మీడియా యువత జగన్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
అయితే గత రెండున్నరేళ్లుగా ఎవరి కలిసి వచ్చినా రాకున్నా ప్రత్యేక హోదాపై రాజీలేని పోరాటం చేస్తున్న వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదాను కోరుతూ చేసే ఏ కార్యక్రమాన్నయినా, ఉద్యమాన్నయినా తాము స్వాగతం చెబుతామని ట్వీట్ చేశారు. ఆయన ఉద్దేశం మంచిదే అయినా రాజకీయ ఉద్యమం తమ మౌన ప్రదర్శన చిత్తశుద్ధిని పలుచబారుస్తుందేమోనని విద్యార్థులు కలవరపడుతున్నారు.
 
ఒకటి మాత్రం స్పష్టం. పవన్ కల్యాణ్ కానీ వైఎస్ జగన్ కానీ ఉద్యమాన్ని తమ నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నాలకు దిగకుండా, సమస్యపై మాత్రమే దృష్టి పెట్టి విద్యార్థులకే నాయకత్వం కట్టబెట్టి తాము నైతిక మద్దతు ప్రకటిస్తే రేపు ఆర్కే బీచ్‌లో ప్రారంభం కానున్న ప్రత్యేక హోదాపై మౌన ప్రదర్శన  తప్పకుండా తన ప్రభావం చూపుతుంది. ఈ విషయంలో కూడా ఏపీ యువతకు తమిళనాడు యువతే ప్రేరణ నివ్వాలి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్‌ని ఇంప్రెస్ చేయాలని నా పరువు పూర్తిగా పోగొట్టుకోవాలా.. చంద్రబాబు మథనం