Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం వైకాపా పక్కా ప్లాన్.. ప్రైవేట్ బిల్లుకు పట్టు

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో నిరసనలు చేపట్టాలని వైకాపా నిర్ణయించుకుంది. హోదా కోసం ప్రైవేటు మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టడంతోపాటు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైన

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం వైకాపా పక్కా ప్లాన్.. ప్రైవేట్ బిల్లుకు పట్టు
, సోమవారం, 30 జనవరి 2017 (11:04 IST)
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో నిరసనలు చేపట్టాలని వైకాపా నిర్ణయించుకుంది. హోదా కోసం ప్రైవేటు మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టడంతోపాటు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైనా ఓటింగ్‌కు పట్టుబట్టనుంది. 
 
ఇందులో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ అధ్యక్షతన ఆదివారం జరిగిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్యాకేజీ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని జగన్‌ ఆరోపించారు. రాష్ట్రం బాగుపడాలంటే ప్రత్యేక హోదా రావాల్సిందేనని, హోదాకు ఏదీ సాటిరాదని అన్నారు. దీనిపై పార్లమెంటులో గొంతు విప్పాలని పార్టీ ఎంపీలకు సూచించారు.
 
ఈ సమావేశానికి అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ..  చట్టంలో ఉన్నవే కేంద్రం చేస్తోందని చెప్తునప్పుడు... మళ్లీ చట్టబద్ధత అంటూ ప్రజలను చంద్రబాబు మోసపుచ్చే కార్యక్రమాలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రానికి కోట్లలో పెట్టుబడులు వస్తున్నాయంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 
 
గత ఏడాది భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాల్లో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో.. ఎంతమందికి ఉపాధి దొరికిందో చంద్రబాబు వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. హోదా కోరుతూ ప్రైవేటు మెంబర్‌ బిల్లును ప్రవేశ పెట్టాలని... ఇందుకోసం...రాజకీయపక్షాల మద్దతును కూడగట్టాలని వైకాపా ఎంపీలు పక్కా ప్లాన్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఐగా ఉండి జీపు వాడొద్దు.. కుర్చీలో కూర్చోరాదు.. సీఐ భార్యగా అన్నీ చేయొచ్చా?