Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాష్ట్ర విభజనకు రెండేళ్లు.. హైదరాబాదులోనే వైకాపా ఆఫీస్.. ఏపీలో జగన్ ఆఫీస్‌ ఎప్పుడు?

ఏపీ విభజన జరిగిపోయింది. రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లవుతోంది. సీఎం కార్యాలయం, మంత్రులు, సచివాలయంతో పాటు పాలన అంతా రాష్ట్ర రాజధాని అమరావతి, విజయవాడ నుండే నడుస్తోంది. విభజన జరిగిన కొద్ది నెలలకే ప్రధాన పార

రాష్ట్ర విభజనకు రెండేళ్లు.. హైదరాబాదులోనే వైకాపా ఆఫీస్.. ఏపీలో జగన్ ఆఫీస్‌ ఎప్పుడు?
, బుధవారం, 18 జనవరి 2017 (13:05 IST)
ఏపీ విభజన జరిగిపోయింది. రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లవుతోంది. సీఎం కార్యాలయం, మంత్రులు, సచివాలయంతో పాటు పాలన అంతా రాష్ట్ర రాజధాని అమరావతి, విజయవాడ నుండే నడుస్తోంది. విభజన జరిగిన కొద్ది నెలలకే ప్రధాన పార్టీలన్నీ ఆఫీసులను మార్చుకున్నాయి.

అయితే ఏపీ ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా మాత్రం హైదరాబాదును వీడలేదు. దీనిపై వైకాపా సీనియర్లు.. వైకాపా చీఫ్ జగన్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పార్టీ అంతంత మాత్రంగానే ఉన్న తెలంగాణలో ప్రధాన కార్యాలయం ఉంచి, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఆఫీసు లేకపోవడంపై వైకాపా కార్యకర్తలు కూడా గుర్రుగా ఉన్నారు. 
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర పార్టీ కార్యాలయంపై గతంలో జగన్ కొన్ని ప్రకటనలు చేసినప్పటికీ అవి ముందుకు సాగలేదు.

గతంలో శాసనసభలో బలాబలాల ఆధారంగా పార్టీలకు చంద్రబాబు ప్రభుత్వం భూములు కేటాయించింది. అయితే.. బీజేపికి ఇచ్చినంత స్థలాన్నే వైసీపీకి ఇవ్వడాన్ని జగన్ తప్పుపట్టారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ప్రభుత్వ ఉదారతపై ఆధారపడకుండా సొంతంగా భూమిని కొనుగోలు చేసి పార్టీ ఆఫీసు నిర్మించుకుందామనే అభిప్రాయాన్ని సన్నిహితుల వద్ద జగన్ వెలిబుచ్చారు. అయితే.. ఆ విషయంలో ఇంత వరకు ముందడుగు పడకపోవడంపై సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇంకా హైదరాబాదులో వైకాపా ఆఫీసు ఉండటం వల్ల లాభాలేంటని వారు ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన సమయం వచ్చిందని, ఇప్పటికైనా పార్టీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించకుంటే.. 2014 పరిస్థితులు పునరావృతం కాక తప్పదని సీనియర్లు, రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు. 
 
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికారం చేజిక్కుంచుకోవాలంటే.. పార్టీ పరిపాలన అంతా ఆంధ్రప్రదేశ్ నుండే జరగాలని సీనియర్లు వాదిస్తున్నారు. కానీ ఎప్పుడూ సీనియర్ల మాట పట్టించుకోని జగన్.. కార్యాలయాన్ని ఏపీకి మార్చే అంశాన్ని సీరియస్ తీసుకోలేదట. ప్రజా సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లాలంటే.. ప్రతీసారి హైదరాబాద్ రావాల్సి వస్తోందని సీనియర్లు అంటున్నారు. ఇంకా కార్యకర్తలకు, ప్రజలకు కూడా వైకాపా ఆఫీసు ఏపీలో లేకపోవడం ఇబ్బంది కలిగిస్తుందని టాక్. 
 
తెలంగాణ కొచ్చి.. ఆంధ్రప్రదేశ్ సమస్యలు, అక్కడి ప్రజల గురించి చర్చించాలంటే.. సొంత రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడుతున్నామన్న భావన కలగడం లేదని వైసీపీ నేతలు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమ ఒకరితో -పెళ్లి వేరొకరితో.. పెళ్లైనా ప్రియుని అఫైర్: భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హత్య..