Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇప్పటినుంచి జగన్ 2.0ని చూస్తారు : వైఎస్ జగన్ (Video)

Advertiesment
jagan

ఠాగూర్

, బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (16:58 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో లండన్ పర్యటన తర్వాత మరింత కసి పెరిగినట్టు తెలుస్తుంది. ఇటీవల లండన్ నుంచి బెంగుళూరుకు, అక్కడ నుంచి అమరావతిలోని తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత పార్టీకి చెందిన కీలక నేతలతో ఆయన మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా వారితో మాట్లడుతూ, ఇప్పటి నుంచి జగన్ 2.0 ను చూస్తారంటూ వెల్లడించారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కార్యకర్తల కోసం ఈ జగన్ ఎలా పనిచేస్తాడో మీకు చూపిస్తాను, జగన్ 1.0లో ప్రజల కోసమే తాపత్రయ పడ్డారు. వారికి మంచి చేసే క్రమంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయినట్టు చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూస్తూ తట్టుకోలేకపోతున్నాను, ఈ కార్యకర్తల కోసం ఈ జగన్ నిలబడతాడు. ఇక నుంచి జగన్ 2.0ను చూస్తారంటూ వ్యాఖ్యానించారు. 
 
రాజకీయ నేతలు.. ధనవంతులంతా కుంభమేళాలో చనిపోవాలి...
 
దేశంలోని రాజకీయ నేతలు, ధనవంతులంతా ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో చనిపోవాలని, అపుడే వారికి మోక్షం లభిస్తుందని బీహార్ రాష్ట్రానికి చెందిన స్వతంత్ర ఎంపీ రాజేశ్ రంజ్ (పప్పు యాదవ్) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో ఈ మహాకుంభమేళా వేడుకలు అత్యంత ఆధ్యాత్మికతతో జరుగుతున్న విషయం తెల్సిందే. 
 
అయితే, ఈ కుంభమేళాలో ఇటీవల తొక్కిసలాట జరిగింది. పదుల సంఖ్యలో భక్తులు చనిపోయారు. దీనిపై పప్పూ యాదవ్ స్పందిస్తూ, కుంభమేళా తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారు మోక్షం పొందినట్టు ఒక బాబా చెప్పారని, అందువల్ల బాబాలు, సంపన్నులు, రాజకీయ నేతలు త్రివేణి సంగమంలో చనిపోయి మోక్షం పొందాలని ఆయన సూచించారు. 
 
ఇదే అంశంపై లోక్‌సభలో మాట్లాడుతూ, కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట తర్వాత 300 నుంచి 600 మంది వరకు ప్రాణాలు కోల్పోయివుంటారని, వారి మృతదేహాలను అక్కడి నుంచి తొలగించారని పేర్కొన్నారు. మృతులకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
పైగా, కుంభమేళాలో చనిపోయిన వారంతా మోక్షం పొందినట్టు ఒక బాబా చెప్పారని, అందువల్ల మన దేశంలోని రాజకీయ నేతలు, ధనవంతులు, బాబాలు కూడా త్రివేణి సంగమంలో మునిగి చనిపోయి మోక్షం పొందాలని పప్పు వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Beware of loan apps: లోన్ యాప్‌ల నుంచి బయటపడాలంటే.. టి. పోలీసుల వార్నింగ్