Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మధ్యాహ్నం 12 గంటలకు జగన్ .. రాత్రి 7 గంటలకు మోడీ ప్రమాణం

Advertiesment
మధ్యాహ్నం 12 గంటలకు జగన్ .. రాత్రి 7 గంటలకు మోడీ ప్రమాణం
, సోమవారం, 27 మే 2019 (08:27 IST)
సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన నరేంద్ర మోడీ, వైఎస్. జగన్ మోహన్ రెడ్డిలు ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నవ్యాంధ్ర సీఎంగా వైఎస్. జగన్ 30వ తేదీ గురువారం ప్రమాణం చేస్తారు. ఆయన గురువారం మధ్యాహ్నం 12.23 నిమిషాలకు ప్రమాణం చేస్తారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణం చేయిస్తారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 
 
అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ కూడా అదే రోజు రాత్రి 7 గంటలకు ప్రమాణం చేస్తారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన విషయం తెల్సిందే. దీంతో మోడీ మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 
 
ఈయన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం గురువారం రాత్రి 7 గంటలకు జరుగుతుందని రాష్ట్రపతి భవన్ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మోడీతో పాటు మరికొంతమంది మంత్రులు ప్రమాణం చేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇది నిజంగానే చారిత్రక విజయం : బీజేపీ గెలుపు అద్వానీ