ప్రముఖ ఫార్మా స్యూటికల్ సంస్థ సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ రంగ ప్రగతి, సన్ ఫార్మా యూనిట్ స్థాపన వంటి కీలకాంశాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. త్వరలో ఏపీలో సన్ ఫార్మా ప్లాంట్ స్థాపిస్తామని ఆ సంస్థ ఎండీ దిలీప్ సాంఘ్వీ వెల్లడించారు.
ఇంటిగ్రేటెడ్ ఎండ్‌టు ఎండ్ ప్లాంట్‌గా తీసుకొస్తామని.. ఎగుమతులే లక్ష్యంగా ఉత్పత్తులు ఉంటాయన్నాయని సన్ ఫార్మా తెలిపింది. పారిశ్రామికాభివృద్ధి ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు తీసుకుంటున్నారని దిలీప్ సాంఘ్వీ వివరించారు. సన్ ఫార్మా పరిశ్రమను త్వరలో నెలకొల్పి తయారీ సామర్ధ్యాన్ని పెంచుకుంటామన్నారు.
పరిశ్రమల స్థాపనకు కావల్సిన పూర్తి సహకారాన్ని ముఖ్యమంత్రి అందిస్తామన్నారని దిలీప్ సాంఘ్వీ చెప్పారు. ఏపీ నుంచి ఔషధాల్ని ఎగుమతి చేయాలనేది తమ లక్ష్యమని సన్ ఫార్మా ఎండీ చెప్పారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో తమ ఆలోచనల్ని షేర్ చేసుకున్నామని పరిస్థితి సానుకూలంగా ఉందని తెలిపారు. మరోవైపు ఏపీలో పారిశ్రామిక ప్రగతికై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరించారు.