ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా, తెలుగు రాష్ట్రాలు, విదేశాలలో వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తన తండ్రి స్మారకంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని నివాళులర్పించారు.
ఈ ప్రత్యేక ప్రార్థనల్లో సతీమణి విజయమ్మ, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు, పెద్దఎత్తున అభిమానులు పాల్గొన్నారు. ప్రార్థనల తర్వాత, జగన్ తన తల్లి విజయమ్మను కలిశారు. ఈ ముఖ్యమైన సందర్భంగా ఆమె జగన్‌ను ఆశీర్వదించారు. తండ్రిని తలచుకుని మిస్ యూ నాన్న అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.