Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖ ఎయిర్‌పోర్టు రన్‌వేపై జగన్ బైఠాయింపు.. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. డీజీపీ

విశాఖ ఎయిర్‌పోర్టు రన్‌వేపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి బైఠాయించారు. ప్రత్యేక హోదా కోసం వైజాగ్ విశాఖ బీచ్‌లో ఆంధ్రా యువత చేపట్టదలచిన మౌన దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వని పరిస్థితి తెల్సిందే. అదేసమయం

విశాఖ ఎయిర్‌పోర్టు రన్‌వేపై జగన్ బైఠాయింపు.. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. డీజీపీ
, గురువారం, 26 జనవరి 2017 (16:33 IST)
విశాఖ ఎయిర్‌పోర్టు రన్‌వేపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి బైఠాయించారు. ప్రత్యేక హోదా కోసం వైజాగ్ విశాఖ బీచ్‌లో ఆంధ్రా యువత చేపట్టదలచిన మౌన దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వని పరిస్థితి తెల్సిందే. అదేసమయంలో వైకాపా కాగడాల ర్యాలీకి పిలుపునిచ్చింది. ఇందులోపాల్గొనేందుకు జగన్ గురువారం విశాఖకు చేరుకున్నారు. అయితే, జగన్‌ను ఎయిర్‌పోర్టు దాటనీయకుండా నిర్బంధించాలని ప్లాన్ వేశారు.ఈ విషయం తెలుసుకున్న జగన్.. రన్‌వే పైనే బైఠాయించారు. 
 
మరోవైపు.. విశాఖకు వస్తున్న రాజకీయ పార్టీల నేతలతో పాటు.. యువతను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేస్తున్నారు. ఈనెల 28వ తేదీ వరకు విశాఖలో ఎలాంటి నిరసన ప్రదర్శనలకు అనుమతి లేదని ఏపీ డీజీపీ సాంబశివరావు వెల్లడించారు. అదేసమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ... విశాఖలో అంతర్జాతీయ భాగసామ్య సదస్సు జరుగుతోందని, ఈ నేపథ్యంలో నిరసనలు, ఉద్యమాలు చేయడం సరికాదన్నారు. అంతేగాక విశాఖ నగరమంతా 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని డీజీపీ హెచ్చరించారు.
 
అలాగే, కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక హోదాను ప్రకటించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పులివెందులలో వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నలుగురు విద్యార్థులు తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ప్రకటించకుంటే పోరాటం తప్పదని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. హోదా అంశంపై అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
అంతకుముందు.. కృష్ణా జిల్లాలో పలువురు వైసీపీ నేతలను పోలీసులు హౌస్‌ అరెస్ట్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో పలుచోట్ల ఆయాపార్టీల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. కాగా... ప్రత్యేక హోదా కోసం ర్యాలీ నిర్వహించేందుకు బెజవాడలో కాంగ్రెస్ నేతలు యత్నించారు. కాళేశ్వరరావు మార్కెట్‌ దగ్గర మల్లాది విష్ణు సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే కృష్ణా జిల్లాలో పలువురు వైసీపీ నేతలను పోలీసులు హౌస్‌ అరెస్ట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలవరం కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టొద్దు.. రాయపాటికి పవన్ కళ్యాణ్ చురక