ప్రత్యేక హోదా కోసం బలిదానం... మదనపల్లె యువకుడి ఆత్మహత్య
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఓ యువకుడు ఆత్మత్యాగానికి పాల్పడ్డాడు. ఆ యువకుడి పేరు సుధాకర్. వయసు 26 యేళ్లు. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని రామారావ
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఓ యువకుడు ఆత్మత్యాగానికి పాల్పడ్డాడు. ఆ యువకుడి పేరు సుధాకర్. వయసు 26 యేళ్లు. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని రామారావు కాలనీకి చెందిన రామచంద్ర, సరోజమ్మల కుమారుడు. నేత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌తో సుధాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సుధాకర్ బలన్మరణానికి పాల్పడేముందు 'నా చావుకు ఎవ్వరూ కారణం కాదు. ప్రత్యేక హోదా మన హక్కు' అని సూసైడ్ నోట్ రాసిపెట్టాడు. మదనపల్లెలో చేనేత కార్మికుడిగా పనిచేస్తున్న సుధాకర్.. ప్రత్యేక హోదా కోసం జరిగిన పలు ఉద్యమాల్లో పాల్గొన్నాడు. చనిపోయే ముందురోజు కూడా ఓ అనాథాశ్రమానికి రూ.5 వేలు విరాళం ఇవ్వడం గమనార్హం.
సుధాకర్ తల్లిదండ్రులు మదనపల్లె మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడి మరణంతో సుధాకర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా, గతంలో తిరుపతికి చెందిన మును కోటి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.