Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇది రెఫరెండం ఎలా అవుతుందమ్మా?.. నువ్వే చెప్పమ్మా? : జగన్ మోహన్ రెడ్డి

నంద్యాల ఉప ఎన్నికలో ఓడినప్పటికీ... శిల్పా సోదరులు చాలా గ్రేట్ అని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితంపై జగన్ స్పందిస్తూ.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వచ్చిన శిల్పా సోదరులు రా

Advertiesment
Y S Jagan Mohan Reddy
, సోమవారం, 28 ఆగస్టు 2017 (18:12 IST)
నంద్యాల ఉప ఎన్నికలో ఓడినప్పటికీ... శిల్పా సోదరులు చాలా గ్రేట్ అని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితంపై జగన్ స్పందిస్తూ.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వచ్చిన శిల్పా సోదరులు రాజకీయ విలువలకు అర్థం తీసుకొచ్చారన్నారు. 
 
విలువలకు కట్టుబడి పదవికి రాజీనామా చేసిన శిల్పా సోదరులకు అభినందనలు తెలుపుకుంటున్నానని అన్నారు. వైసీపీ ఎప్పుడూ విలువలకు కట్టుబడి ఉంటుందన్నారు. ప్రలోభాలకు, భయభ్రాంతులకు అధికార పార్టీ గురి చేసినా పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని తెలిపారు. 
 
‘‘ఇవి సాధారణ ఎన్నికలు కాదు కాబట్టి, ఆ విషయం ప్రజలకు తెలుసు కాబట్టి.. ఇవాళ నేను చంద్రబాబు వ్యతిరేకంగా ఓటు వేసినా ఆయన ఇప్పుడే అధికారం నుంచి తప్పుకోరు కాబట్టే.. ఎలాగో ఒక సంవత్సరం ఆయనతోనే కొనసాగాలి కాబట్టి.. ఇక గత్యంతరం లేక ఆయన ప్రలోభాలాకు లొంగి ప్రజలు ఓట్లు వేశారు. అంతేకానీ, ఇది ఏ రకంగానూ చంద్రబాబు నాయుడి విజయం కాదు. ఇది విజయం అని చంద్రబాబు నాయుడు అనుకుంటే ఆయనంత మూర్ఖుడు ప్రపంచంలో ఇంకొకరుండరు.’’ అని జగన్ చెప్పారు.
 
‘‘ఇది రెఫరెండం ఎలా అవుతుందమ్మా?.. నువ్వే చెప్పమ్మా?.. నాకు ఒకటి చెప్పు... ఒకే ఒక చోట ఎలక్షన్ జరపడం, మొత్తం 200 కోట్ల డబ్బు పెట్టడం, మొత్తం మంత్రులందరినీ కూర్చోబెట్టడం, పోలీసులందరినీ భయబ్రాంతులను చేసే విధంగా వాడుకోవడం, ఇలాంటి పరిస్థితి క్రియేట్ చేసి ఎలక్షన్ చేస్తే అది రెఫరెండం అవుతుందా?.. నీకు రెఫరెండం అంటే ఏంది?.. చంద్రబాబుకు ఇవాళ నేను సవాల్ విసురుతున్నా... మన పార్టీకి సంబంధించిన 20 మంది ఎమ్మెల్యేలనూ ఒకేసారి తీసుకొని రా.. అప్పుడు చూస్తా నేను. 20 చోట్ల నువ్వు రెండొందల కోట్లు ఎలా ఖర్చుపెడతావో. 20 చోట్ల పోలీసులు నీ మాట వింటారేమో నేను చూస్తా అని వ్యాఖ్యానించారు. 
 
20 చోట్ల నువ్వు ఎలా భయపెట్టగలవో నేను చూస్తా. అది రెఫరెండం మీనింగ్. అంతేగానీ, ఇదేందండీ.. ఒకే నియోజకవర్గం. ఒకటే బయటకు తీస్తారు. దాంట్లోనే బై ఎలక్షన్ అంట.. 200 కోట్ల డబ్బంట.. పోలీసులంట.. భయబ్రాంతులంట.. ఇన్ని చేసి అది రెఫరెండం ఎలా అవుతుందండీ? దీన్ని రెఫరెండం అనే వాళ్లకు సెన్స్ ఉండాలి. మా పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్లను చంద్రబాబు నాయుడు మళ్లీ తన పార్టీ గుర్తు మీద గెలిపించుకునే ధైర్యం, కాన్ఫిడెన్స్ తనకు లేదు. పాలిటిక్స్‌లో ఉండాల్సింది.. ధైర్యముండాలన్నారు. మా టైం వస్తుంది. అప్పుడు మేమూ కొడతాం.’’ అని జగన్ బదులిచ్చారు.
 
కాగా, నంద్యాల‌లో ప్ర‌జ‌ల తీర్పును గౌర‌విస్తామ‌ని ఏపీసీసీ అధ్యక్షుడు ర‌ఘువీరారెడ్డి పేరిట ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారంలో త‌మ పార్టీని ఆద‌రించిన ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు పేర్కొంది. ఈ ఎన్నిక ఫ‌లితాల‌ను స‌మీక్షించుకుని తాము ముంద‌స్తు కార్యాచ‌ర‌ణ వేసుకుని ప‌నిచేస్తామ‌ని తెలిపింది. అధికారంతో సంబంధం లేకుండా త‌మ పార్టీ నిరంత‌రం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతుంద‌ని చెప్పింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇక టీడీపీకి పార్టీకి తిరుగులేదు: ఎమ్మెల్యే బాల‌కృష్ణ