Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉమాభారతి సమక్షంలో హరీష్ - దేవినేని మాటల యుద్ధం.. 'చాయ్' సలహా ఇచ్చిన మంత్రి

కేంద్ర మంత్రి ఉమాభారతి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు, ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుల మధ్య మాటల యుద్ధం జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ నోరు పారేసుకున్నారు. దీంతో మంత్రి ఉమాభారత

ఉమాభారతి సమక్షంలో హరీష్ - దేవినేని మాటల యుద్ధం.. 'చాయ్' సలహా ఇచ్చిన మంత్రి
, గురువారం, 22 సెప్టెంబరు 2016 (11:16 IST)
కేంద్ర మంత్రి ఉమాభారతి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు, ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుల మధ్య మాటల యుద్ధం జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ నోరు పారేసుకున్నారు. దీంతో మంత్రి ఉమాభారతి జోక్యం చేసుకుని వారిద్దరికి టీ ఇచ్చి శాంతపరిచారు. 
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కృష్ణా జలాల విషయమై అపెక్స్ కమిటీలో వాదనలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య ఓ దశలో తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కేంద్ర మంత్రి ఉమాభారతి స్వయంగా కల్పించుకోవాల్సి వచ్చింది. నందిగామ ప్రాంతానికి తెలంగాణ భూభాగం నుంచి నీరివ్వాలని, అందుకు సహకరించాలని ఏపీ మంత్రి దేవినేని ఉమ ప్రస్తావించారు. దీంతో తెలంగాణ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలకు దిగారు. 
 
తాము సహకరిస్తున్నా, ఏపీ తమ ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన గట్టిగా మాట్లాడారు. పట్టిసీమ నుంచి గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నందున, ఆదా అయ్యే నీటిలో తమకూ వాటా కావాల్సిందేనని హరీశ్ పట్టుబట్టారు. దీంతో ఇరువురి మధ్య మాటలు అదుపు తప్పుతున్నాయని భావించిన ఉమా భారతి జోక్యం చేసుకుని ప్రశాంతంగా ఉండాలని సూచించారు. "అప్పుడప్పుడూ కలిసి చాయ్ తాగండి. మాట్లాడుకోండి. అప్పుడిలా విభేదాలుండవు" అంటూ వారిని సముదాయించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా సైన్యానికి గట్టి ఎదురుదెబ్బ : రసాయన దాడి చేసిన ఐఎస్ఐఎస్