Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమ-పెళ్లి పేరిట మోసం.. రెండుసార్లు గర్భం.. మరో యువతితో కానిస్టేబుల్ పెళ్లి

ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. పెళ్లాడతానని నమ్మించాడు. లోబరుచుకున్నాడు. సొమ్ములన్నీ కాజేశాడు. రెండుసార్లు ఆ యువతిని గర్భం ధరించేలా చేశాడు. కానీ మాయమాటలో అబార్షన్ చేయించాడు. కానీ రెండోసారి అబార్షన్‌కు

Advertiesment
Woman Employee Cheated By Marine Constable At Guntur District
, బుధవారం, 26 అక్టోబరు 2016 (12:48 IST)
ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. పెళ్లాడతానని నమ్మించాడు. లోబరుచుకున్నాడు. సొమ్ములన్నీ కాజేశాడు. రెండుసార్లు ఆ యువతిని గర్భం ధరించేలా చేశాడు. కానీ మాయమాటలో అబార్షన్ చేయించాడు. కానీ రెండోసారి అబార్షన్‌కు అంగీకరించని ఆమెకు దాడికి పాల్పడ్డాడు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రవీణ్ కుమార్ అనే మెరైన్ కానిస్టేబుల్ నయవంచన వెలుగుచూసింది. దీంతో కాలు విరిగిన ఆమెను ఆస్పత్రిలో చేర్పించి దాదాపు పది రోజులు దగ్గరుండి చికిత్స చేయించాడు. 
 
పూర్తిగా కోలుకున్నాక పెళ్లిచేసుకుందామని నచ్చజెప్పి.. ట్రైనింగ్ కోసం వెళ్ళొస్తాననంటూ నాలుగు రోజులు స్విచ్ఛాఫ్ చేసి జక్కేశాడు. ఆ నాలుగు రోజుల్లోనే మరో యువతిని పెళ్లాడాడు. నిజం తెలుసుకుని ప్రేయసి నిలదీస్తే.. ప్రవీణ్ తల్లిదండ్రులు కూడా తనను బెదిరిస్తున్నారని బాధితురాలు వెల్లడించింది. 
 
తమ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది పోలీస్ డిపార్ట్ మెంట్‍‌లో పనిచేస్తున్నారని నీవేమీ చేయలేవని ప్రవీణ్ బెదిరించినట్లు బాధితురాలు వాపోయింది. దీంతో ఎస్పీని కలిసి గ్రీవెన్ సెల్‌కు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2030 నాటి భారత్ ఎలా ఉంటుందంటే... అమెరికా రాయబారి కామెంట్స్...