Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సహజీవనం చేస్తున్న వ్యక్తే ఆ మాట అన్నాడనీ...

ఎన్నికష్టాలు ఎదురైనా కడదాకా కాపాడుతానని మాటిచ్చిన మనిషిని నమ్మి సహజీవనం చేస్తూ వచ్చిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కొన్నేళ్లుగా సహజీవనం చేస్తూ వచ్చిన వ్యక్తే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం అంటగట్టడమేక

సహజీవనం చేస్తున్న వ్యక్తే ఆ మాట అన్నాడనీ...
, సోమవారం, 26 జూన్ 2017 (12:58 IST)
ఎన్నికష్టాలు ఎదురైనా కడదాకా కాపాడుతానని మాటిచ్చిన మనిషిని నమ్మి సహజీవనం చేస్తూ వచ్చిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కొన్నేళ్లుగా సహజీవనం చేస్తూ వచ్చిన వ్యక్తే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం అంటగట్టడమేకాకుండా, అసభ్య పదజాలంతో దూషించి వేధించడాన్ని జీర్ణించుకోలేని ఆ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
కావలి కొత్తబజారు సమీపంలోని వరవకాలువ వీధిలో షాకీరా (30) అనే మహిళ నాయబ్‌రసూల్‌ అనే వ్యక్తితో సహజీవనం చేస్తూ అద్దె ఇంట్లో నివశిస్తున్నారు. వీరిద్దరికి మూడేళ్ల బాబున్నాడు. షాకీరా తండ్రి చికిత్స నిమిత్తం నెల్లూరు నారాయణ వైద్యశాలలో చేరాడు. తండ్రి వద్దకు వెళుతున్నానని చెప్పి బయటకు వచ్చింది. 
 
అయితే, ఆమె తండ్రి ముందుగా శనివారం రాత్రికే కావలికి చేరుకున్నాడు. కానీ షాకీరా మాత్రం ఆదివారం ఉదయం ఇంటికి వచ్చింది. దీంతో ఆమెను నాయబ్‌ రసూల్‌ అనుమానించి వేధించాడు. జీవితంమై విరక్తి చెందిన షాకీరా నాయబ్‌రసూల్‌ను బయటకు వెళ్లనిచ్చి ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది.
 
కాగా, నాయబ్ రసూల్‌కు మొదటి భార్య ఉంది. ఈమె కుమార్తెను హత్య చేసిన కేసులో నాయబ్ రసూల్‌తో పాటు.. షాకీరాలు నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఈనేపథ్యంలో సహజీవనం చేస్తూ వచ్చిన మహిళ మృతికి కారణమైన నాయబ్ రసూల్‌ను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి చాలా మంచోడు... 'నువ్వొద్దురా పో' అంటే కార్గో వ్యాపారం చేస్కుంటా... నాని