Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లలు పుట్టలేదని అత్త, మామల వేధింపులు - వివాహిత ఆత్మహత్య

పిల్లలు పుట్టలేదని అత్త, మామల వేధింపులు - వివాహిత ఆత్మహత్య
, శనివారం, 14 మే 2016 (11:17 IST)
చిత్తూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. వివాహమై ఒకటిన్నర సంవత్సరం అవుతున్నా పిల్లలు పుట్టలేదని అత్త, మామలు వేధించడంతో ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే చిత్తూరుకు సమీపంలోని ఐరాల మండలం వడ్డిపల్లెకు చెందిన చెన్నకేశవుల నాయుడుకు, పూతలపట్టు మండలం కోట్లపల్లెకు చెందిన గుణశ్రీ అనే యువతితో 13 నెలల క్రితం వివాహమైంది. 
 
వివాహమైనప్పటి నుంచి అత్తమామలు బాగానే ఉన్నా పిల్లలు పుట్టలేదన్న కోపంతో ఘర్షణ పడేవారు. దీంతో గుణశ్రీ మనస్థాపం చెందిన శనివారం ఉదయం ఇంట్లో నుంచి పొలానికి వెళ్ళి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుణశ్రీ మరణంతో మృతురాలి బంధువులు కన్నీంటి పర్యాంతమవుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యాభర్తల తోపులాట.. నెట్టేసిన భార్య.. గోడకు గట్టిగా తగలడంతో భర్త మృతి!