Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్యాభర్తల తోపులాట.. నెట్టేసిన భార్య.. గోడకు గట్టిగా తగలడంతో భర్త మృతి!

భార్యాభర్తల తోపులాట.. నెట్టేసిన భార్య.. గోడకు గట్టిగా తగలడంతో భర్త మృతి!
, శనివారం, 14 మే 2016 (10:43 IST)
భార్యాభర్తల తోపులాటలో భర్త ప్రాణాలు కోల్పోయిన సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే..లాల్‌బజార్‌ శాస్త్రినగర్‌కు చెందిన భార్గవి, రాజ్‌కుమార్‌లు గురువారం రాత్రి గొడవకు దిగారు. వాగ్వివాదంలో భార్య భార్గవిని రాజ్‌కుమార్ చితకబాదాడు. దాంతో రాజ్‌కుమార్‌ను ఆమె నెట్టేసింది. రాజ్‌కుమార్ గోడకు పడిపోవడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఎస్సై కృష్ణమూర్తియాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. భార్యను రాజ్‌కుమార్ చితక్కొట్టడంతో అతని దెబ్బల నుంచి తప్పించుకునేందుకు భర్తను దూరంగా నెట్టేసిందని.. అయితే రాజ్ కుమార్ మెదడు గోడకు గట్టిగా తగలడంతో ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. అయితే ఈ ఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు కృష్ణమూర్తియాదవ్ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాట మార్చిన డోనాల్డ్ ట్రంప్.. ముస్లింలపై తాత్కాలిక నిషేధం మాత్రమే విధించాలి!