Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిమ్మల్ని నమ్మినందుకు గొంతు కోస్తారా? మీకో దండం: సీఎం బంగ్లాకి వైసిపి ఎమ్మెల్యే సెల్యూట్

Advertiesment
Kapu Ramachandra Reddy

ఐవీఆర్

, శనివారం, 6 జనవరి 2024 (15:43 IST)
వైసిపిలో క్రమంగా అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు తమకు సీట్లు కేటాయించడంలేదనీ, మరికొందరు తమను కాదని వేరెవరికో సీట్లు ఇస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో పలువురు అసంతృప్త నేతలు నేరుగా అధినేతనే లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా రాయదుర్గం వైసిపి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఏకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి సవాల్ చేసి మరీ వెళ్లారు.
 
రాయదుర్గం వైసిపి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనకు రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ నిరాకరించడంపై మండిపడ్డారు. వైఎస్ కుటుంబాన్ని నమ్మితే గొంతు కోస్తారా? మీకో దండం అంటూ ముఖ్యమంత్రి బంగళా వైపు తిరిగి సెల్యూట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఐతే రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల నుంచి తనతో పాటు తన భార్య పోటీ చేస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సవాల్ విసరడం చర్చనీయాంశంగా మారింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంగన్వాడీలపై ఎస్మా చట్టం.. అయినా వెనక్కి తగ్గేదిలేదు..