Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

300 కోట్ల రూపాయల విలువచేసే విశాఖ స్టీల్ ప్లాంట్ 50 కోట్లకు విక్రయిస్తారా?

Advertiesment
300 కోట్ల రూపాయల విలువచేసే విశాఖ స్టీల్ ప్లాంట్ 50 కోట్లకు విక్రయిస్తారా?
, గురువారం, 25 నవంబరు 2021 (19:51 IST)
రాయలసీమ జిల్లాలను అతలాకుతలం చేసిన వరదలపై పలు పార్టీల నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడుతో పాటు కమ్యూనిస్టు పార్టీల నేతలు వరద బాధితులను పరామర్సిస్తున్నారు. ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు.

 
ఇప్పటికే రాయలచెరువు ప్రాంతాన్ని సందర్సించిన నారాయణ తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. వరద ప్రభావంపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు. తిరుపతి జాతీయ స్థాయి కేంద్రం.. గతంలో ఎన్నడూ ఇలా ముంపుకు గురికాలేదన్నారు.

 
అధికార పార్టీ నేతలు దౌర్జన్యం, ఆక్రమణలకు పాల్పడడం వల్లే చివరకు ముంపుకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజకీయ నాయకుల గురించి తెలుసుకుంటే వర్షం కూడా ఆగదేమోనన్నారు నారాయణ. నష్టపరిహారం అందించడంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. 

 
భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మూడు చట్టాలను ఎవరి కోసం తీసుకొచ్చారని ప్రధానమంత్రిని నారాయణ ప్రశ్నించారు. ఆర్డినెన్స్ దారుణమని.. గతంలో ఎందుకు పార్లమెంటులో చర్చించలేదన్నారు.

 
900 మంది రైతులు చనిపోయాక బాద్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. దేశం ఆర్థిక తిరోగమనం చెందితే అంబానీ, అదాని ఎలా కోట్లు సంపాదించారని ప్రశ్నించారు. మోడీపై వ్యతిరేకత ప్రజల్లో ఉందన్నారు. అఖిలేష్ యాదవ్‌ను ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. 

 
స్వామినాథన్ రిపోర్ట్‌ను ఆమోదించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్ధలు విక్రయిస్తున్నారన్నారు. 300 కోట్ల రూపాయల విలువచేసే విశాఖ స్టీల్ ప్లాంట్ 50 కోట్లకు విక్రయిస్తారా అంటూ ప్రశ్నించారు. 41 రక్షణ ఫ్యాక్టరీలు 7 కార్పొరేషన్లు చేసి విక్రయిస్తున్నారని.. 100 ఎయిర్ పోర్టులు కట్టి ఎయిరిండియాను విక్రయించారని విమర్సించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాగి రచ్చ చేస్తారా.. బుద్ధుందా... సిగ్గుందా? ఎమ్మెల్యే ప్రసన్న ఫైర్