Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుదుచ్చేరికి ప్రత్యేకహోదా ఇస్తామన్న కేంద్రంప్రకటనపై ముఖ్యమంత్రి స్పందించడా?: సయ్యద్ రఫీ

పుదుచ్చేరికి ప్రత్యేకహోదా ఇస్తామన్న కేంద్రంప్రకటనపై ముఖ్యమంత్రి స్పందించడా?:  సయ్యద్ రఫీ
, శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (09:31 IST)
పుదుచ్చేరిలో బీజేపీని గెలిపిస్తే, ప్రత్యేకహోదా ఇస్తామని కేంద్రంచెప్పిందని, ఏపీకి మాత్రం ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమనిచెప్పినా ముఖ్యమంత్రి బీజేపీ ని, కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడంలేదని టీడీపీ అధికా రప్రతినిధి సయ్యద్ రపీ నిలదీశారు.

ముఖ్యమంత్రి జగన్ అవకాశవాది కాబట్టి, విద్యార్థులను, యువతను మోసగిస్తూ, హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించడంలేదన్నారు. అక్కడి నాయకుడైన మల్లాది కృష్ణారావును గెలిపించాలని వైసీపీనేతలైన పిల్లిసుభాష్ చంద్రబోస్ మరికొందరు ప్రచారంచేస్తున్నా రని, అక్కడి ప్రభుత్వాన్ని కూలదోయడానికి జగన్మోహ న్ రెడ్డి డబ్బుసంచులు పంపాడని రఫీ ఆరోపించారు.

పుదుచ్చేరిలో కృష్ణారావుని గెలిపించాలనికోరడం ద్వారా జగన్ ప్రభుత్వం బాహటంగానే బీజేపీకి మద్ధతిస్తోంద న్నారు. బీజేపీకి, జగన్ కుఉన్న అక్రమ సంబంధం పు దుచ్చేరి ఘటనతో బట్టబయలైందన్నారు. పుదుచ్చేరికి ప్రత్యేకహోదా ఇస్తామన్న కేంద్రాన్ని ప్రశ్నించని ముఖ్యమంత్రి, అక్కడ బీజేపీవారికి కొమ్ముకాయడ మేంటని రఫీ ప్రశ్నించారు.

బీజేపీతో సఖ్యతగాఉంటే, తన కేసులనుంచి తాను బయటపడవచ్చన్నదే జగన్ ఆలోచన అని, అందుకే ఆయన కేంద్రాన్ని ప్రశ్నించడం లేదన్నారు. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమైతే, పుదుచ్చేరికి ఎలాఇస్తారని ముఖ్యమంత్రి ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదన్నారు?

ప్రత్యేకహోదాతో రాష్ట్రం రూపురేఖలే మారిపోతాయని, ప్రతిజిల్లా హైదరా బాద్ అవుతుందని, 22మందిఎంపీలను ఇస్తే సాధిస్తాన ని గతంలో ఊదరగొట్టిన జగన్, రాష్ట్రాన్నివంచించిన బీజే పీకి మద్ధతుఎలా తెలుపుతున్నాడో ఆయనే ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

తన అవినీతి కేసులకోసమే ముఖ్యమంత్రి ప్రత్యేకహోదాను కేంద్రానికి తాకట్టుపెట్టాడన్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం ఏమైనాచేయడం, ఏది పడితే అదిచెప్పడం ముఖ్యమంత్రికి అలవాటుగా మారిందన్నారు. టీడీపీప్రభుత్వంలో కేంద్రం రాష్ట్రానికి ఇస్తామన్న నిధులనుకూడా జగన్ సాధించలేకపోయాడన్నారు.

హోదాఇవ్వకపోయినా, వెనుకబడిన జిల్లాలకు, అమరావతికి నిధులివ్వకపోయినా, రైల్వేజోన్ అటకె క్కించినా, విశాఖస్టీల్ ను అమ్మేస్తున్నాముఖ్యమంత్రి ఎందుకు నోరెత్తడంలేదన్నారు. తనప్రయోజనాలు, తన పై ఉన్నకేసులకోసమే, ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని రఫీ మండిపడ్డారు.

పుదుచ్చేరిలో గతంలో ఉన్న నారాయణస్వామి ప్రభుత్వాన్నికూలదోయడానికి జగన్మోహన్ రెడ్డే సహకరించాడని, ఇప్పుడేమో బీజేపీకి మద్ధతిస్తూ, తన ప్రయోజనాలను కాపాడుకుంటున్నా డన్నారు. ఇతరరాష్ట్రాల్లోని ప్రభుత్వాలను పడగొట్టడా నికి డబ్బులు పంపాల్సిన అవసరం ఈముఖ్యమంత్రికి ఎందుకొచ్చిందన్నారు?

తిరుపతి ఉపఎన్నికలో జగన్మో హన్ రెడ్డి అసమర్థతను ఎత్తిచూపుతామని, బీజేపీతో, ముఖ్యమంత్రికున్న లోపాయికారీ ఒప్పందాలను కూడా ఎండగడతామని రఫీ స్పష్టంచేశారు. గతంలో రాజీనా మాలతో దేశమంతా రాష్ట్రంవైపుచూసేలా చేస్తానన్న జగన్, ఇప్పుడు తనపార్టీఎంపీలతో ఎందుకు ఆ పని చేయించడంలేదన్నారు.

జగన్మోహన్ రెడ్డికి మరోఎంపీని గెలిపించినా, ఈరాష్ట్రానికి ఏమీ ఒరగదనే వాస్తవాన్ని తిరుపతిపార్లమెంట్ లోని ప్రజలు గమనించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి మౌనం రాష్ట్రానికి శాపంగా మారిందని, వైసీపీప్రభుత్వ వికృత రాజకీయక్రీడను రాష్ట్రవాసులు గమనించాలన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'నైపుణ్యం' మరింత వికసించాలి : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి