Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యకు గుడి కట్టిన పోలీస్.. ఎక్కడ?

భార్య బతికి ఉండగానే నరకాన్ని చూపిస్తున్న ప్రబుద్ధులు ఉన్న ఈ రోజుల్లో... ఇటువంటి వారికి విరుద్ధంగా చనిపోయిన భార్య కోసం గుడికట్టించి నిత్యం పూజిస్తున్నారో పోలీసు అధికారి. భార్య చనిపోయి ఆమె కర్మకాండలు జరుగక ముందే మళ్లీ పెళ్లి కోసం మంతనాలు సాగించే ప్రబుద

Advertiesment
wife temple
, సోమవారం, 27 మార్చి 2017 (14:12 IST)
భార్య బతికి ఉండగానే నరకాన్ని చూపిస్తున్న ప్రబుద్ధులు ఉన్న ఈ రోజుల్లో... ఇటువంటి వారికి విరుద్ధంగా చనిపోయిన భార్య కోసం గుడికట్టించి నిత్యం పూజిస్తున్నారో పోలీసు అధికారి. భార్య చనిపోయి ఆమె కర్మకాండలు జరుగక ముందే మళ్లీ పెళ్లి కోసం మంతనాలు సాగించే ప్రబుద్ధులు ఎందరో ఉన్నారు. ఐతే చేతిలో అధికారం ఉంది... ఉన్నత స్థాయి ఉద్యోగం ఉంది... అయినా ఎటువంటి ఆకర్షణలకు లోను కాకుండా ఆమె వల్ల కలిగిన కుమార్తెల బాధ్యతను భుజంపై వేసుకుని చనిపోయిన భార్యకు గుడి కట్టించారంటే ఆయన భార్యను ఎంతగా ప్రేమించారో... దీన్నిబట్టి సుస్పష్టం అవుతుంది. 
 
అదనపు కట్నాల కోసం భార్యలను చంపిన ప్రబుద్ధులు ఉన్నారు. వేధింపులకు గురిచేసిన చవటలు, వెధవలు ఎంతోమంది ఉన్నారు. భార్య బతికి ఉండగానే మళ్లీ పెళ్లిచేసుకున్న దుర్మార్గులు ఉన్నారు... వీరందరికీ అతీతంగా ఒక భార్య చాలు... ఆమె సేవలతో తరించవచ్చు... ఆమెపై అఖండ అభిమానం పెంచుకుని తండ్రిగా లాలించి, కుమారునిగా అభిమానించిన పోలీసు అధికారి ఒకరున్నారు. ఆయన పేరు మునిరామయ్య. 
 
ప్రస్తుతం తిరుమల కొండపై డిఎస్పీగా బాద్యతలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు ఆయనను దురదృష్టం వెన్నాడింది. ఎంతో ప్రేమించిన ఇల్లాలిని మృత్యువు కబళించింది. ఆ బాధను తట్టుకోలేక, ఆమెను మరిచిపోలేక స్వంత గ్రామంలో ఆమె పేరుతో గుడిని కట్టారు. లోపల ఆమె నిలువెత్తు విగ్రహాన్ని పెట్టి నిత్యం పూజిస్తున్నారు. ఇటువంటి వారిని ఎవరినీ తాము ఇంతవరకు చూడలేదని ఆ గ్రామస్తులతో పాటు... వివరాలు తెలిసిన పోలీసు వర్గాలు, మీడియా వర్గాలు 'మునిరామయ్య'ను అభిమానిస్తున్నాయి. 
 
ఈ అధికారి ఆ వివరాలు బయటకు రానీయకుండా గోప్యంగా ఉంచారు. అదేమిటని అడిగితే తనకు ప్రచారం అక్కర్లేదు... నాతో గత కొన్నేళ్ల నుంచి అనుబంధంతో ఉన్న ఆమెను మనసులోనే కాదు... బయట కూడా గుర్తుంచుకోవాలనే ఉద్దేశ్యంతో గుడి కట్టించానే తప్ప వేరే ఆలోచన, ఆశలతో కాదని ఆయన సన్నిహిత వర్గాలతో చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఈ రోజుల్లో కూడా భార్యను ఈ విధంగా అభిమానించే మనుషులు ఉన్నారని రుజువు చేశారు మునిరామయ్య.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ పార్టీకి మేమే అంత్యక్రియలు నిర్వహిస్తాం : బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి