Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వర్మ ఉన్నట్లుండి జగన్‌ని ఎందుకు గోకుతున్నట్లు?

ట్వీటర్ కింగ్ వర్మ ఉన్నట్లుండి వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌ని ఎందుకు గోకుతున్నట్లు? ఏపీ తుపాకీని పేల్చేది, దాని సమస్యలను తీర్చగలిగేది వైఎస్ జగనే అనే స్థాయిలో వర్మ ఎందుకు ప్రశంశిస్తున్నట్లు? ఇది ఇప్పుడు ఏపీలో మిలియన్ డాలర్ల క్వశ్చన్ అయింది. వైకాపాలో

వర్మ ఉన్నట్లుండి జగన్‌ని ఎందుకు గోకుతున్నట్లు?
హైదరాబాద్ , గురువారం, 2 ఫిబ్రవరి 2017 (02:37 IST)
ట్వీటర్ కింగ్ వర్మ ఉన్నట్లుండి వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌ని ఎందుకు గోకుతున్నట్లు? ఏపీ తుపాకీని పేల్చేది, దాని సమస్యలను తీర్చగలిగేది వైఎస్ జగనే అనే స్థాయిలో వర్మ ఎందుకు ప్రశంశిస్తున్నట్లు? ఇది ఇప్పుడు ఏపీలో మిలియన్ డాలర్ల క్వశ్చన్ అయింది. వైకాపాలో భవిష్యత్తులో చేరడానికి మార్గం సిద్ధం చేసుకుంటున్నాడా అంటే అదేమీ కాదు. ఎందుకంటే వర్మకు రాజకీయాలు పడవు. తనకు వైకాపా అంటే కోవం లేదని, హోదా విషయంలో ఆ పార్టీతో చేతులు కలుపుతానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించినా, వర్మ ఇప్పుడు జగన్‌పై ఊహించని సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించినా  దాని అర్థం  ప్రత్యేక హోదా విషయంలో జగన్ తొలి నుంచి చేస్తున్న రాజీలేని పోరాటాన్ని ఈ ఇద్దరూ గుర్తించినట్లేనా.. ఇప్పటికైతే ఇది తెగని చిక్కుముడి. 
 
రాంగోపాల్ వర్మ రూటే వేరు.. ఎప్పుడు ఎవరిమీద ట్వీటర్ బాణం సంధిస్తాడో, ఎప్పుడు ఎవరిని ఆకాశంలోకి లేపుతాడా, ఎవరిని ఎప్పుడు అమాంతం నేలకేసి కొడతాడో ఎవరకి తెలీని పరిస్థితి.
 
ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత పరిస్ధితులపై, ప్రత్యేకహోదా అంశాలపై తరచూ ట్వీట్లు చేస్తూ వస్తున్న దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ రూపురేఖలపై ట్వీట్‌ చేశారు. భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌ రూపు తుపాకీని పోలి ఉందని ఆంధ్రప్రదేశ్‌ ఫోటోను పోస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అనే తుపాకీని వినియోగించి బుల్లెట్లు పేల్చి దాని సమస్యలను తీర్చగలిగేది వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మాత్రమేనని వర్మ పేర్కొన్నారు.
 
ప్రతిపక్ష నేత జగన్‌పై ఈ ప్రశంసలు నిజంగా వర్మ హృదయంలోంచి వస్తున్నట్లయితే అది వైకాపాకు బెస్ట్ కాంప్లిమెంటే అవుతుంది. అటు రాజకీయ రంగంలో నాగార్జునను వివాదాస్పద ట్వీట్లతో వేధించకుండా వదిలిపెట్టిన వర్మ ఇప్పుడు వైఎస్ జగన్‌ని కూడా ప్రశంసల వర్షంతో దరిచేర్తుకోవడం చాలామందికి సందేహంగానే ఉంది. దీనివెనుక మతలబు ఏంటో స్పష్టం అయేంతవరకు జగన్‌ని వర్మ గోకుతున్న కారణం బయటకు రానట్లే. 
 
ఏదేమైనా ఇటీవలి కాలంలో వైఎస్ జగన్ చంద్రబాబు చేతగానితనం పుణ్యమా అని తన విశ్వసనీయత గ్రాఫ్‌ను మరింత పెంచుకుంటున్నట్లే లెక్క.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మసాజ్‌తో పాటు అదికూడా... రెడ్ హ్యాండెడ్‌గా పట్టేశారు..