Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చైనాకు వెళ్లడంతోనే గుంటూరుకు రాలేదా..? చిరంజీవి పార్టీ నుంచి దూరమయ్యారా?

కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారని వార్తలు వస్తున్నాయి. అందుకే ఆ పార్టీ వ్యవహారాలకు అంటీముట్టనట్లు చిరంజీవి వ్యవహరిస్తున్నారు. కాంగ్

చైనాకు వెళ్లడంతోనే గుంటూరుకు రాలేదా..? చిరంజీవి పార్టీ నుంచి దూరమయ్యారా?
, సోమవారం, 5 జూన్ 2017 (14:46 IST)
కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారని వార్తలు వస్తున్నాయి. అందుకే ఆ పార్టీ వ్యవహారాలకు అంటీముట్టనట్లు చిరంజీవి వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గుంటూరులో ప్రత్యేక హోదాపై బహిరంగ సభను నిర్వహించింది. ఈ ప్రతిష్టాత్మక సభకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు శరద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ, సీపీఐ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, డి. రాజాలతో పాటు పలువురు డీఎంకే నేతలు కూడా హాజరయ్యారు. కానీ ఈ సభకు ప్రముఖులొచ్చినా.. మెగాస్టార్ చిరంజీవి రాలేదు. 
 
అంతకుముందు ఈసభ ఏర్పాట్ల కోసం, రాహుల్‌ను ఏపీ పర్యటనకు ఆహ్వానించేందుకు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లారు. అప్పుడు కూడా చిరు అక్కడ కనిపించలేదు. దీంతో చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారని కొందరు అంటున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఆయన చైనాలో ఉన్నారని.. హాలీడేస్ కోసం చైనా వెళ్లారని చెప్తున్నారు. 
 
ఇంకా చెప్పాలంటే.. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు చనిపోయినప్పుడు కూడా ఆయన రాలేదని, చైనా టూర్‌లో ఉండడం వల్లే వెనక్కి రాలేకపోయారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం పార్టీ వ్యవహారాలకు చిరంజీవి చాలారోజులుగానే దూరంగా ఉంటున్నారని చెప్తున్నారు. మరి దీనిపై చైనా నుంచి వచ్చాక చిరంజీవి ఏమంటారో వేచి చూడాల్సిందే. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లైకులు ఇవ్వండి.. లోన్ తీసుకోండి.. సలామ్ లోన్స్ గురించి మీకు తెలుసా?