వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న తమ్మినేని సీతారాంను అసెంబ్లీ స్పీకర్‌గా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీ నేతలు అస్సలు అసెంబ్లీలో తమ గొంతును వినిపించకుండా స్పీకరే అడ్డుపడుతున్నారన్నది విశ్లేషకుల భావన.
అందులోను ఒకవైపు సిఎంతో కలిసి 151 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష టిడిపి ఎమ్మెల్యేలను అస్సలు మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని తెదేపా విమర్శిస్తోంది. అయితే శ్రీకాకుళంజిల్లాలో నెలకొన్న సమస్యలు ప్రభుత్వం ఎలాంటి అభివృద్థి చేయాలన్న విషయంపై అసెంబ్లీలో చర్చ నడుస్తోంది. ఇలాంటి సమయంలో తమ్మినేని ఒక్కసారిగా కంట తడిపెట్టారు. వైజాగ్ రూరల్ నుంచి విజయనగరం, శ్రీకాకుళం నగరాలు అస్సలు అభివృద్థికి నోచుకోలేదు. పూర్తిస్థాయిలో అది జరగలేదు.
ఇప్పటికీ మహిళలు బ్లౌజులు వేసుకోవడం లేదు. సరిగ్గా చీర కట్టుకోవడం లేదు అంటూ కంట కన్నీరు పెట్టుకున్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. మొదటగా చంద్రబాబు మాట్లాడుతుండగా మధ్యలో కలుగజేసుకుని స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మా బాధ ఎవ్వరికీ చెప్పుకోవాలో గతంలో అర్థం కాలేదని ఒక సామాన్య ప్రజానీకంలా ఆయన మాట్లాడిన తీరు, భావేద్వేగానికి లోనైన పరిస్థితి సభ్యులందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇదొకటే కాదు గతంలో అసెంబ్లీలో నిద్రపోవడం.. మహిళా ఎమ్మెల్యేలను తల్లి అంటూ సంబోధించడం.. టిడిపి ఎమ్మెల్యేలతో ఒక విధంగా, తమ పార్టీ ఎమ్మెల్యేలతో మరోవిధంగా ఉండడం తమ్మినేని సీతారాంకు ఉన్న అలవాటే. అయితే తమ్మినేని సీతారాం హోదా కన్నా ఎప్పుడూ తాను ఒక సామాన్య వ్యక్తిలాగే భావిస్తూ ఉంటారని, అందుకే ఆయన ఇలా వ్యవహరిస్తుంటారని ఆయన స్నేహితులు చెబుతున్నారు.