Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ రచ్చలో పైచేయి ఎవరిది? పంచాయితీ ఢిల్లీ చేరితే ఏం జరగనుంది?

Advertiesment
ఏపీ రచ్చలో పైచేయి ఎవరిది? పంచాయితీ ఢిల్లీ చేరితే ఏం జరగనుంది?
, శనివారం, 23 అక్టోబరు 2021 (15:07 IST)
ఏపీలో పూర్తిగా రాజకీయాలు మారాయి. టి‌డి‌పి అధినేత చంద్రబాబుకు…రాజకీయాల్లో ఎప్పుడూ ఎలాంటి ఎత్తులు వేసి, ప్రత్యర్ధులని చిత్తు చేయాలో బాగా తెలుసు. అయితే ఒకప్పుడు బాబు వ్యూహాలు వర్కౌట్ అయ్యాయి కానీ…ఇప్పుడు వర్కౌట్ అయ్యే పరిస్తితి కనిపించడం లేదు. 
 
ఇప్పుడు ఆయన ధర్మగ్రహ దీక్ష పరిస్తితి కూడా అంతేనని టాక్ వస్తోంది. వైసీపీ శ్రేణులు టి‌డి‌పి కార్యలయంపై దాడికి నిరసనగా చంద్రబాబు…ఆఫీసులోనే 36 గంటల పాటు నిరసన దీక్షకు దిగారు. అయితే ఇక్కడ దీక్ష చేస్తున్నారో లేక నేతల చేత భజన చేయించుకుంటూ….జగన్‌ని తిట్టిస్తున్నారో అర్ధం కాదు. సరిగ్గా ఈ దీక్ష మాదిరిగానే…2019 ఎన్నికల ముందు చంద్రబాబు ధర్మపోరాట దీక్షలని చేశారు.
 
కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిందని చెప్పి, ప్రభుత్వ సొమ్ముతో ఎడాపెడా ధర్మపోరాట దీక్షలు పెట్టేశారు. ఆ దీక్షల్లో ఏం ఉండదు… నాలుగు మంచి సోఫా సెట్లు, చుట్టూ నాలుగు ఏసీ కూలర్లు… సోఫాలో బాబు కూర్చోవడం వరుసపెట్టి టి‌డి‌పి నేతలు, కార్యకర్తలు ఆయనకు దండం పెట్టి, సెల్ఫీలు దిగడం…అలాగే బాబుని ఆహా ఓహో అంటూ పొగడటం…మోడీని తిట్టడం. ఇక ఈ సెట్టింగ్‌లు వల్ల బాబుకు ఎంత డ్యామేజ్ జరిగిందో చెప్పాల్సిన పని లేదు. అధికారం కూడా కోల్పోయారు.
 
అయినా సరే బాబు మారడం లేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా సేమ్ సెట్టింగ్ పెట్టుకుని, ధర్మగ్రహ దీక్ష అంటున్నారు. ఈ దీక్ష వల్ల వైసీపీకి జరిగే డ్యామేజ్ లేదు. ఏ విషయమైన ప్రజల్లోకి వెళ్ళి పోరాడాలి… అలా కాకుండా ఏసీల మధ్య సోఫా బెడ్లపై కూర్చుని దీక్ష చేస్తానంటే పావలా ప్రయోజనం ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీడీపీ కార్యాలయాలపై దాడుల వ్యవహారంపై పంచాయితీ ఢిల్లీ చేరితే ఏం జరగనుంది? అనే దానిపై చర్చ మొదలైంది. ఏపీ రచ్చలో పైచేయి ఎవరిది? అనేది తెలియాల్సివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బయోమెట్రిక్ పేరుతో జీతాలు కట్... ఖంగుతిన్న ఆరోగ్య సిబ్బంది