Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్ పరీక్ష ఎప్పుడు చేయించుకోవాలి?

కోవిడ్ పరీక్ష ఎప్పుడు చేయించుకోవాలి?
, సోమవారం, 19 ఏప్రియల్ 2021 (10:17 IST)
ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో కోవిడ్ వైరస్ అనేక జన్యు  మార్పులు  చెంది రెండవ దశ లోనికి ప్రవేశించి, తన లక్షణాలు, వ్యాధి  ప్రభావం సైతం మార్చుకుని, బలం పుంజుకుని  చాప కింద నీరులా మొదటి దశ లో కంటే అత్యంత తీవ్ర ప్రభావం చూపిస్తూ  ప్రజల యొక్క ప్రాణాలు వేగంగా బలి తీసుకుంటున్నది. దీన్నే ప్రస్తుతం సెకండ్ వేవ్ అంటున్నారు. 
 
పైకి అంతా మామూలే ఏం పరవలేదు అని అనిపిస్తున్నా, ప్రస్తుతం మనం మొదట్లో కంటే అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్నామని సంగతి ఎవరికీ అర్దం కావడం లేదు. మొదటి దశలో కోవిడ్ వైరస్ జన్యుపరమైన మార్పులు చెందలేదు. వ్యాధి లక్షణాలు కూడా తేలిక పాటి జ్వరం, వాసన, రుచి  గుర్తించలేకపోవడం, కొద్దిపాటి చలి మరియు శ్వాస సరిగా అందకపోవడం వంటివి ఉండేవి. 
 
వివిధ దేశాల ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు, కఠిన షరతులతో కొద్ది కాలం పాటు  విధించిన లాక్ డౌన్ వలన వైరస్ ప్రభావం  తీవ్రత తగ్గుముఖం పట్టడముతో  అంతా బాగుంది అని భావించి, ఆయా  దేశాల  యొక్క ఆర్దిక పరిస్థితులు, ప్రజలయొక్క కుటుంబ జీవన శ్రేయస్సు దృష్టి లో పెట్టుకుని  సడలించిన ఆంక్షలు తో మామూలు పరిస్థితులు ఏర్పడుతున్న ఈ తరుణం లో కోవిడ్ వైరస్ జన్యు పరంగా మార్పులు చెంది మొదటి దశ నుండి రెండో దశలోకి ప్రవేశించింది. 
 
హఠాత్తుగా  కళ్ళు ఎర్రబారడం, ఎడతెగని నీళ్ళ విరోచనాలు, మరియు వినికిడి సమస్య లు వంటి లక్షణాలు తో పాటు మొదటి దశ లక్షణాలు శరీరం లో గమనిస్తే వారు కోవిడ్ రెండవ దశ ప్రభావానికి గురయినట్లు భావించాలి. ఇటువంటి సందర్భం లో తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు దిగువన ఇవ్వబడ్డాయి.
 
కోవిడ్ పరీక్ష ఎప్పుడు చేయించుకోవాలి?
సాధారణ లక్షణాలు అయిన జ్వరం, వళ్ళు నొప్పులు, రుచి వాసన తెలియడం లేదు అనిపించినప్పుడు, చలి మరియు శ్వాస సరిగా తీసుకోలేని సందర్భాలు తో పాటు,  రెండోదశలోని కొత్త లక్షణాలు అయిన కళ్ళు ఎర్రబారడం, నీళ్ళ విరోచనాలు,  వినికిడి సమస్య లు వంటి వాటితో పాటు, ఎవరైనా  సరే కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించిన వ్యక్తితో పొరపాటున కనీసం 6 అడుగులు కంటే దగ్గరగా, మరియు ఆ వ్యక్తితో  15 నిముషాల కంటే ఎక్కువ సమయం సంభాషించినా, అతనితో గడిపినా, అటువంటి వారు ఖచ్చితముగా కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి.
 
కోవిడ్ పరీక్ష అవసరము లేని వ్యక్తులు ఎవరు?
ఎవరైతే వ్యక్తులు ప్రభుత్వము సూచించిన విధముగా కోవిడ్ వ్యాక్సిన్ ను రెండు డోసులు పొంది 15 రోజులు దాటిపోయి  ఉంటా రో, అటువంటి వ్యక్తులు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన వ్యక్తుల తో   6 అడుగులు కంటే దగ్గరగా, మరియు ఆ వ్యక్తితో  15 నిముషాల కంటే ఎక్కువ సమయం సంభాషించినా, అతనితో గడిపిన వ్యాక్సిన్ పొందిన  సదరు  వ్యక్తులకు తరువాత వారికి ఎటువంటి కోవిడ్ లక్షణాలు కనిపించకపోతే వారు పరీక్ష చేయించుకొన అవసరం లేదు.
 
ఎలాంటి పరీక్ష చేయించుకోవాలి?
ప్రస్తుతం రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పాలిమర్స్ ఛైన్ రియాక్షన్ (RT-PCR)విధానం ద్వారా నిర్వహించే పరీక్షని కోవిడ్ నిర్ధారణకు ఉత్తమ పరీక్ష గా ప్రపంచవ్యాప్తంగా భావిస్తున్నారు. 
 
ర్యాపిడ్ అంటిజెన్ టెస్ట్(RAT) అని మరొక పరీక్ష విధానం కూడా  అందుబాటులో ఉన్నది. ఈ ర్యాపిడ్ అంటిజెన్ టెస్ట్(RAT)విధానం లో ఫలితాలు అనేవి వేగవంతంగా పొందవచ్చు. ఒకవేళ కోవిడ్ వ్యాధి లక్షణాలు కలిగి ఉండి ఈ ర్యాపిడ్ అంటిజెన్ టెస్ట్(RAT)విధానం లో కోవిడ్ లేదని ఫలితము వచ్చినట్లయితే అటువంటి సందర్భాల్లో రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పాలిమర్స్ ఛైన్ రియాక్షన్ (RT-PCR) పరీక్షా విధానం సిఫార్సు చేయబడుచున్నది.
 
ఈ మధ్య CT వాల్యు , CT స్కోర్ అంటున్నారు అవి దేనికి సంబంధించినవి?
 
CT (Cycle Threshold) వాల్యూ అనేది రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పాలిమర్స్ ఛైన్ రియాక్షన్ (RT-PCR) పరీక్షా విధానం లో రోగి నుండి తీసుకున్న నమూనా లో ఉండే వైరస్ జన్యు పదార్ధం యొక్క పరిమాణాత్మక సాంద్రత విలువలు సూచిస్తుంది. ఈ RT-PCR  పరీక్షా విధానం లో తక్కువ పరిమాణం లో నమోదు అయ్యే  CT  వాల్యు సంబంధిత రోగి అధిక వైరల్ లోడ్ తో  తీవ్రమైన వ్యాధి తో బాధపడుతున్నాడని, మరియు ఇతని ద్వారా అంటువ్యాధి అధికంగా ప్రభలే అవకాశాన్ని సూచిస్తుంది.

అలాగే ఈ పరీక్షలో అధిక పరిమాణం లో  నమోదు అయ్యే  CT వాల్యు సంబంధిత రోగి తక్కువ వైరల్ లోడ్ తో తక్కువ అంటువ్యాధి కలిగి ఉన్నాడని మరియు ఇతని వలన సంక్రమణ ప్రమాదము  తక్కువ ఉంటుందని చెప్పవచ్చు.
 
ఇక CT స్కోరు అనేది COVID-19 ప్రమేయము వలన  ఊపిరితిత్తులలో కలిగిన  మార్పులు మరియు వాటిని  అంచనా వేయడానికి CT స్కాన్ ద్వారా పరీక్ష చేసి దాని ఆధారంగా నిర్ణయించే  స్కోరింగ్ వ్యవస్థ ని CT స్కోర్ అంటారు. ఈ CT స్కాన్   పరీక్షా విధానం లో తక్కువ గా  నమోదు అయ్యే  CT  స్కోర్ తో  సంబంధిత రోగి తక్కువ  వైరల్ లోడ్ తో  తేలికైన  వ్యాధి తో బాధపడుతున్నాడని, మరియు ఇతని ద్వారా అంటువ్యాధి ప్రభలే అవకాశం తక్కువుగా సూచిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రైవేట్ టీచర్ల కోసం కేసీఆర్ చేయూత.. రూ. 2000లు, 25 కిలోల బియ్యం