Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ డీజీపీ సర్... ఏమిటీ కిరికిరి

Advertiesment
ఏపీ డీజీపీ సర్... ఏమిటీ కిరికిరి
, మంగళవారం, 3 మార్చి 2020 (08:17 IST)
దేశంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఏపీ రాష్ట్ర పోలీసు శాఖ.. ఇప్పుడు న్యాయస్థానాల ముందు తలొంచుకోవాల్సి వస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా చీవాట్లు తినాల్సి వస్తోంది.

పోలీసు బాస్ అయితే ఏకంగా రెండు మార్లు కోర్టుకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. రాష్ట్ర చరిత్రలోనే పోలీస్ శాఖకు ఇది తలవంపులని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

రెండు వారాల వ్యవధిలోనే హెడ్‌ ఆఫ్‌ ద పోలీస్‌ ఫోర్స్‌(హెవోపీఎ్‌ఫ)ను హైకోర్టు స్వయంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం మొత్తం డిపార్ట్‌మెంట్‌కు వర్తిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

రాజకీయ కారణాలు, ఇతరత్రా వ్యవహారాల్లో చిక్కుకోకుండా పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తే పోలీస్‌ బాస్‌ ఎందుకు కోర్టు ముందు నిలబడాల్సి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. విశాఖపట్నం పోలీసులు ఏదో వ్యవహారంలో ఫిబ్రవరిలో గౌతమ్‌, లోచిని అనే దంపతులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయాన్ని బయటకు ప్రకటించలేదు. గౌతమ్‌ తండ్రి పోలీసు స్టేషన్‌కు వెళ్లినా వారిని చూపించలేదు. తన కుమారుడు, కోడలిని పోలీసులు ఏమి చేస్తారోనన్న భయంతో కోర్టులో ఆయన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వ్యవహారంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ఫిబ్రవరి 14న స్వయంగా హాజరు కావాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో పోలీసుశాఖ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇంతలోనే సోమవారం మరోసారి డీజీపీకి తాఖీదులందాయి.

ప్రతిపక్ష నేత చంద్రబాబు అడ్డగింత.. అరెస్టు వ్యవహారంపై మార్చి 12న స్వయంగా హాజరయి వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు ఇటీవల విశాఖపట్నం పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి పోలీసులు ఆయనను 151 సీఆర్‌పీసీ కింద అరెస్టు చేశారు.

ప్రతిపక్షనేత హోదాలో ఆయన ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లారు. విశాఖ విమానాశ్రయంలో దిగేందుకు ముందే వైసీపీ నేతలు అప్పటికే సమీకరించిన వందలాది మంది అక్కడికి చేరుకుని చంద్రబాబుపై కోడిగుడ్లు, చెప్పులు, టమాటాలు విసిరారు.

వారిని అదుపు చేసి చంద్రబాబు ముందుకు వెళ్లేందుకు చర్యలు చేపట్టాల్సిన పోలీసులు, కొన్ని గంటలపాటు విమానాశ్రయంలోనే ఆయనను ఆపేశారు. వెనక్కి వెళ్లాలని కోరారు. నిరాకరించిన చంద్రబాబు అక్కడే బైఠాయించారు.

చివరికి తన మిత్రుడు అయ్యన్నపాత్రుడు కుమారుడి పెళ్లికి వెళ్లేందుకైనా అనుమతివ్వాలని కోరినా, పోలీసులు ససేమిరా అన్నారు. బలవంతంగా అరెస్టు చేసి హైదరాబాద్‌ విమానం ఎక్కించి పంపించేశారు.

మొత్తం వ్యవహారంపై తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. డీజీపీ  హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లో కరోనా వైరస్.. హైఅలెర్ట్‌లో తెలంగాణ సర్కారు..