కాపులకు రాష్ట్ర ప్రభుత్వ భరోసా: వెయ్యి కోట్లతో సంక్షేమ కార్యక్రమాల అమలు
కాపులకు రాష్ట్ర ప్రభుత్వ భరోసా: వెయ్యి కోట్లతో సంక్షేమ కార్యక్రమాల అమలు
కాపు సామాజికవర్గంలో వెనుకబడిన వర్గాల వారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పలు పథకాలు సత్ఫలితాలనిస్తున్నాయి. వెయ్యి కోట్లతో కాపు వెల్ఫేర్ కార్పోరేషన్ ద్వారా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కాపుల్లోని పేదలకు ప్రభుత్వం ఆర్థిక సాయం, విద్యా సౌకర్యాలు కల్పన, పరిశ్రమల ఏర్పాటుకు సాయమందిస్తోంది. పలు పథకాల్లో కాపుల్లోని వెనుకబడిన వర్గాల వారికీ చేయూతనిస్తున్నాయి. అర్హులైన వారికి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించడం, విద్యార్థులకు విదేశీ విద్య ద్వారా విదేశాలకు పంపించడం, విద్యోన్నతి పథకం ద్వారా రాష్ట్రంలోని కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల్లోని పేదలకు వారు కోరుకున్న కోర్సుకు ఫీజుల చెల్లింపు, చిన్నతరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు నిధుల సాయం ఇలా కాపు వర్గాలకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోంది.
ఓబీఎంఎంఎస్ ద్వారా రూ. 144 కోట్ల నిధులు
ఏపీ స్టేట్ కాపు వేల్ఫేర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ నుంచి ఆన్ లైన్ బెనిఫిషియరీ, మేనేజ్మెంట్ సిస్టమ్ ( ఓబీఎంఎంఎస్) పథకం ద్వారా ఈ ఏడాది ఇప్పటి వరుక రూ. 144 కోట్ల 42 లక్షల రూపాయలను మంజూరు చేసింది. అంతే మొత్తంలో బ్యాంకుల నుంచి రుణాలను అందించే ఏర్పాటు చేస్తోంది. 23,618 మంది అర్హులు ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది.
విదేశీ విద్యా దీవెన పథకం
అర్హులైన కాపు విద్యార్థులు విదేశాల్లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు ‘విదేశీ విద్యా దీవెన’ పథకం కింద రూ.10లక్షల వరకు ఆర్థిక సాయం. వీసా కోసం అయ్యే ఖర్చు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నారు. ఈ పథకానికి రూ. 43 కోట్ల కేటాయించారు. విదేశీ విద్యా దీవెన పథకం కింద ఇప్పటి వరకు 367 మంది విద్యార్థులను విదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం పంపించింది.
విద్యోన్నతి పథకం
ఆర్థికంగా వెనుకబడిన కాపు నిరుద్యోగ యువతకు సివిల్‌సర్వీసెస్,బ్యాంకింగ్ వంటి పోటీ పరీక్షలను ఎదుర్కొనేందుకు అవసరమైన శిక్షణను‘ విద్యోన్నతి కార్యక్రమం’ ద్వారా 15 వేల మందికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. విద్యోన్నతి పథకంలో భాగంగా సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యేందుకు దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థల్లో 500 మంది శిక్షణ అందిస్తున్నారు. ఈ శిక్షణ దేశంలోనే గర్వించదగ్గ విద్యా సంస్థల్లో విద్యార్థులకు కాపు కార్పోరేషన్ శిక్షణ కల్పిస్తోంది. ప్రభుత్వ శాఖల పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు జిల్లాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేసి ఆయా సంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఆ విధంగా ఇప్పటి వరకు 2344 మంది విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షల కోసం అవకాశాలు కల్పించారు.
చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు దన్ను
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు వేల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ నుంచి రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న మధ్య తరగతి పరిశ్రమల ద్వారా (ఎంఎస్ఎంఈ) అర్హులైన కాపు యువతకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 350 దరఖాస్తులను కాపు కార్పోరేషన్ ఆమోదించింది. జిల్లాల వారీగా అనుమతి కోసం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు దరఖాస్తులు పంపించింది. ఒక్కో పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి రూ. 10 లక్షల వరకు సాయం అందించనుంది. ఇప్పటి వరకు 350 దరఖాస్తులకు ఆమోదం తెలుపగా వచ్చే రోజుల్లో ఈ తరహా సాయాన్ని వెయ్యి మంది వరకు అందించనున్నారు. ముగ్గురు లేదా ఐదుగురు సభ్యులు ఓ బృందంగా ఏర్పడి ఈ కార్యక్రమం కింద చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలను ఏర్పాటు చేస్తారు.
అనంతపురం జిల్లా నుంచి 73, చిత్తూరు జిల్లా నుంచి 12, తూర్పు గోదావరి నుంచి 84, గుంటూరు జిల్లా నుంచి 20, కడప జిల్లా నుంచి 25, కృష్ణా జిల్లా నుంచి 10, కర్నూలు జిల్లా నుంచి 19, నెల్లూరు జిల్లా నుంచి 20, ప్రకాశం జిల్లా నుంచి 11, శ్రీకాకుళం జిల్లా నుంచి 8, విశాఖపట్టణం జిల్లా నుంచి 6, విజయనగరం జిల్లా నుంచి 1, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 61 చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటుకు కాపు కార్పోరేషన్ ఆమోదం తెలిపింది.
స్కిల్ డెవలప్మెంట్ పథకం
డిగ్రీ చదివి ఆర్థికంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ. ఒక్కో విద్యార్థికి నెలకు రూ. 5 వేలతో శిక్షణ అందించాలని నిర్ణయించారు. ఈ విధంగా రాష్ట్రంలోని డిగ్రీ చదువుకొని ఆయా ఉద్యోగాలు పొందడానికి కావాల్సిన స్కిల్ పరిజ్ఞనాన్ని అందించేందుకు కాపు కార్పోరేషన్ వివిధ కోర్సులు చేసేందుకు కావాల్సిన ఆర్థిక సహకారాన్ని ఆయా సంస్థల ద్వారా చెల్లిస్తుంది. ఈ పథకం కింద 1440 మంది రాష్ట్రంలోని పలు సంస్థల్లో శిక్షణ తీసుకుంటున్నారు.
కాపు యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఎంతో మంది భవిష్యత్ ను తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులకు స్కాలర్ షిప్ లను అందిస్తోంది. కాపు వెల్ఫేర్ ఎండోమెంట్ ఫండ్ స్కీమ్ ద్వారా కాపుల్లోని పేద వర్గాలకు భరోసానిస్తోంది. కాపు సామాజిక సమావేశాలు, కుటుంబాల వేడుకలు నిర్వహించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 5 కాపు భవన్లు నిర్మాణాన్ని త్వరలోనే చేపట్టనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కాపులకు ఇచ్చిన అన్నీ హామీలను నిలబెట్టుకోవడం ద్వారా కాపు సమాజంలో వెనుకబడిన ప్రజల అభ్యున్నతకి పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది.కాపు వర్గంలోని పేదల పరిశ్రమలు పెట్టుకున్నా, సివిల్స్తోపాటు, పోటీ పరీక్షల్లో శిక్షణ ఇప్పించేందుకుగానీ ఎన్నో రకాల కార్యక్రమాలతో చేయూతనిస్తోంది.