రెండు తెలుగు రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అందువల్ల ఇరు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. ముఖ్యంగా, ఏపీలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలుపడే అవకాశం ఉందని తెలిపింది.
ఉత్తర తమిళనాడు నుంచి కర్నాటక మీదుగా కొంకణ్ తీవం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని, వర్షాలకు ఇదే కారణమని వివరించారు. ఈ కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని పేర్కొంది.
ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అల్లూరి సీతారామరావు, మన్యం అనకాపల్లి, కాకినాడ, ఉభయగోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, ప్రకాశం గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ తెలిపింది. తెలంగాణాలో కూడా వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.