రాష్ట్రంలో ఉన్న రైతులకు ఖరిఫ్ పంటకు సాగునీరు అదించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని చర్యలు చేపడుతున్నారని రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా అన్నారు.
మంగళవారం నాడు సీతానగరం మండలం పురుషోత్తమపట్నం గ్రామంలో తొర్రిగెడ్డ ఎత్తిపోతల పధకం రెండు పైపుల ద్వారా క్రింద ఉన్న ఆయుకట్టకు నీటిని విడుదల చేసే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు..
ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ రైతులకు ఖారీఫ్ పంట సాగులో ప్రతి ఎకరానికి నీరు అందించే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.తొర్రిగడ్డ ఎత్తిపోతల పథకం ద్వారా 240 క్యూసెక్కుల నీటిని క్రింద ఉన్న ఆయుకట్టకు విడుదల చేయడం జరిగిందన్నారు. తద్వారా రాజానగరం నియోజక వర్గంలో కోరుకొండ, సీతానగరం మండల పరిధిలో 15 గ్రామాల రైతులకు ఖారీఫ్ పంటకు సాగునీటిని అందించడం జరుగుతుందన్నారు.
ఈ తొర్రిగడ్డ ఎత్తిపోతల పధకం ద్వారా రాజానగరం నియోజక వర్గంలో 13,451 ఎకరాల ఖరీఫ్ పంటకు సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఈ ఆనంద్ బాబు, ఎ.ఈ శివ ప్రసాద్ వై. యస్.ఆర్.సి.పి నాయకులు డాక్టర్ బాబు, సత్తిపండు రాజు, పి.పి. రాజు, కోయిట రాజు,సురేష్ రాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు.