Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కంప్యూటర్‌ను నియంత్రించి న్యూరాలింక్ చిప్ తొలి పేషెంట్!! అద్భుతమంటూ కామెంట్

noland chip

ఠాగూర్

, గురువారం, 21 మార్చి 2024 (10:56 IST)
మెదడులో న్యూరాలింక్ అమర్చుకున్న రోగి.. కంప్యూటర్‌ను నియంత్రించారు. భుజలా నుంచి కాళ్లవరకూ పూర్తిగా చచ్చుబడిపోయిన నోలాండ్‌ అనే రోగి మెదడులో ఇటీవల శాస్త్రవేత్తలు కంప్యూటర్ చిప్‌ను అమర్చారు. ఈ చిప్‌తో ఇపుడు ఆ రోగి కంప్యూటర్‌ను కంట్రోల్ చేస్తున్నాడు. తన ఆలోచనలతోనే కంప్యూటర్‌ను నియంత్రించి వార్తలకెక్కాడు. దీనిపై ఆయన స్పందిస్తూ, ఈ అనుభవం అద్భుతం అంటూ కామెంట్ చేస్తూ విడుదల చేసిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ చెందిన న్యూరాలింక్ సంస్థ ఈ అద్భుతం సాధించింది. న్యూరాలింక్ మైక్రోచిప్‌ను మెదడులో అమర్చుకున్న తొలిపేషెంట్ కేవలం తన ఆలోచనలతో కంప్యూటర్‌ను నియంత్రించగలిగారు. ఆన్‌లైన్‍‌లో చెస్, వీడియో గేమ్ ఆడారు. 29 ఏళ్ల నోలాండ్ ఆర్‌బర్గ్‌కు ఓ ప్రమాదం కారణంగా భుజాల నుంచి కాళ్ల వరకూ శరీరం చచ్చుబడిపోయింది. ఈ క్రమంలో ఆయన మెదడులో న్యూరాలింక్ శాస్త్రవేత్తలు కంప్యూటర్ చిప్ అమర్చారు. 
 
ఈ చిప్ ఉన్న తొలి పేషెంట్‌గా రికార్డు సృష్టించిన నోలాండ్ తాజాగా కేవలం తన ఆలోచనలతో కంప్యూటర్ గేమ్స్ ఆడారు. స్క్రీన్‌పై ఉన్న మౌస్ ఐకాన్‌న్ను మెదడుతో నియంత్రించారు. "స్క్రీన్‌పై మౌస్ కదలడం చూశారుగా? దాన్ని నేను మెదడుతో నియంత్రించా. అద్భుతం కదూ?! చేయిని కదిపినట్టు, మౌస్‌ను కదిపినట్టు అనుకుంటే స్క్రీన్‌పై ఆ మేరకు మౌస్ కదులుతుంది. మొదట్లో కాస్త తికమకగా ఉన్నా ఆ తర్వాత విషయం పూర్తిగా అవగతమవుతుంది. ఈ అనుభవాన్ని మాటల్లో వర్ణించలేను. న్యూరాలింక్ అధ్యయనంలో భాగమైనందుకు నేనెంతో అదృష్టవంతుణ్ణి అని నోలాండ్ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌‌గా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరేళ్ల బాలికను హత్య చేసిన తండ్రి.. ఇడ్లీ పార్శిల్ తీసుకెళ్లి..?