Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గే గ్రూపు పేరుతో ఫేక్ అకౌట్... ఐదుగురు యువకుల స్వలింగ సంపర్కం

సముద్రతీర ప్రాంతం విశాఖలో సరికొత్త కోణం వెలుగుచూసింది. గే గ్రూపు పేరుతో ఫేక్ ఎప్.బి ఖాతాను ఓపెన్ చేసిన ఐదుగురు యువకులు ఓ వ్యక్తిని మోసం చేశారు. దీనిపై జాయింట్ సీపీ నాగేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతూ

Advertiesment
గే గ్రూపు పేరుతో ఫేక్ అకౌట్... ఐదుగురు యువకుల స్వలింగ సంపర్కం
, ఆదివారం, 16 జులై 2017 (16:02 IST)
సముద్రతీర ప్రాంతం విశాఖలో సరికొత్త కోణం వెలుగుచూసింది. గే గ్రూపు పేరుతో ఫేక్ ఎప్.బి ఖాతాను ఓపెన్ చేసిన ఐదుగురు యువకులు ఓ వ్యక్తిని మోసం చేశారు. దీనిపై జాయింట్ సీపీ నాగేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఐదుగురు యువకులు గే గ్రూపు పేరుతో ఓ ఫేక్ ఖాతాను ప్రారంభించారు. ఈ గే గ్రూప్‌లో 2 వేల మందికిపైగా సభ్యులుగా చేశారు. అయితే, ఈ ఐదుగురు వ్యక్తులు కొన్ని స్వలింగ సంపర్కం వీడియోలు చిత్రీకరించి, బ్లాక్‌మెయిల్ చేసి రూ.2 లక్షల వరకు వసూలు చేశారు. ఇందులో తాను మోసపోయినట్టు తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రధాన నిందితుడు ముక్కాల ఆదిత్యతోపాటు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడిపై ఈ ఐదుగురు యువకులు స్వలింగ సంపర్కం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితులు స్వలింగ సంపర్కాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని, లేకపోతే వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించడంతో బాధితుడు భయపడిపోయి తమ వద్దకు వచ్చారని దీంతో బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులు, నగదు వసూలు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీపీ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రగ్స్ కేసులో తెరాస మంత్రులు ఉన్నారా? అయితే వదిలిపెట్టొద్దు : కేసీఆర్