Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పులివెందుల గడ్డపై అడుగుపెట్టనున్న సీబీఐ.. వణుకుతున్న నేతలు!

పులివెందుల గడ్డపై అడుగుపెట్టనున్న సీబీఐ.. వణుకుతున్న నేతలు!
, బుధవారం, 21 అక్టోబరు 2020 (13:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా, పులివెందులలో ఉన్న అధికార వైకాపా నేతలు వణికిపోతున్నారు. దీనికి కారణం.. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు నిమిత్తం కేంద్ర నేర పరిశోధక బృందం (సీబీఐ) పులివెందుల గడ్డపై అడుగుపెట్టనుంది. దీంతో నేతలంతా వణికిపోతున్నారు. సీబీఐ వస్తే విచారణ ఏమలుపు తిరుగుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారట.
 
వాస్తవానికి ఈ కేసుకు సంబంధించి సీబీఐ ప్రత్యేకంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. దీంతో ఎలాంటి సంచలనాలు వెలుగు చూస్తాయోనన్న చర్చ మొదలైంది. దర్యాప్తు బాధ్యత ఢిల్లీ ప్రత్యేక నేరాల విభాగం 3వ బ్రాంచికి అప్పగించారు. వివేకా కేసులో దర్యాప్తు అధికారిగా డీఎస్పీ దీపక్‌గౌర్‌ను నియమించారు. ఐపీసీ 302 హత్యానేరం సెక్షన్‌ కింద కేసు సీబీఐ రీ-రిజిస్ట్రేషన్‌ చేసింది. 
 
వివేకా హత్య కేసు దర్యాప్తు కోసం త్వరలో ఏపీకి కొత్త బృందం రానుంది. తొలుత వివేకా మృతిని సీఆర్పీసీ 174 సెక్షన్ కింద.. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేయగా.. సీబీఐ మార్పులు చేసింది. త్వరలోనే ఈ స్పెషల్ టీమ్‌ లోతుగా దర్యాప్తు ప్రారంభించనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖుల బండారం బయటపడుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
త్వరలోనే కొత్త సీబీఐ బృందం రంగంలోకి దిగనుండటంతో.. జిల్లాలో కొందరికి వణుకు మొదలైనట్లు తెలుస్తోంది. అప్పట్లో సిట్ బృందం వైఎస్ కుటుంబంలో కీలక వ్యక్తులను విచారించింది. కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్. మనోహర్ రెడ్డి మరో ఇద్దరు సోదరులను ప్రశ్నించింది. 
 
కొత్త సీబీఐ బృందం అధికారులు వీరిని తప్పకుండా విచారిస్తారని విశ్వసనీయ సమాచారం. మొత్తంగా వివేక హత్య కేసులో సూత్రధారులు ఎవరు? పాత్రధారులు ఎవరు అన్న విషయం త్వరలోనే బయటపడుతుందన్న ప్రచారం జరుగుతోంది. మరి కొత్త సిబిఐ బృందం మర్డర్‌ మిస్టరీని ఛేదించడంలో ఏ మేరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమేజాన్ ఉద్యోగులకు వెసులుబాటు.. వర్క్‌ ఫ్రమ్ హోమ్ పొడిగింపు