Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'హోదా' కోసం విచిత్ర వేషాధారణతో పీఠాధిపతి అవతారం ఎత్తిన టీడీపీ ఎమ్మెల్యే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం సముఖత వ్యక్తం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు వివిధ రకాల నిరసనలు తెలుపుతున్నారు. ఇందులోభాగంగా, టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే

Advertiesment
Visakhapatnam South MLA Ganesh Kumar Vasupalli
, మంగళవారం, 2 ఆగస్టు 2016 (10:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం సముఖత వ్యక్తం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు వివిధ రకాల నిరసనలు తెలుపుతున్నారు. ఇందులోభాగంగా, టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే విచిత్ర విషాధారణతో పీఠాధిపతి అవతారమెత్తారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత వాసుపల్లి గణేశ్ కుమార్ ఖద్దరు వదిలి... కాషాయం వస్త్రాలు ధరించారు. ఆ తర్వాత ఆయన పీఠాధిపతి అవతారం ఎత్తారు. అంతటితో ఆయన ఆగలేదు కదా.. పీఠాధిపతి అవతారంలోనే బీజేపీ నేత, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నివాసానికి గణేశ్ కుమార్ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. 
 
మిత్రపక్షానికి చెందిన ఎమ్మెల్యే విచిత్ర వేషధారణలో తన ఇంటికి రావడంతో తొలుత షాక్ తిన్న విష్ణు... ఆ తర్వాత ఆయనను సాదరంగా తన ఇంటిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గణేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ప్రధాని నరేంద్ర మోదీ పీఠాధిపతులకు ఇస్తున్న గౌరవం ప్రజాప్రతినిధులకు ఇవ్వడం లేదని ఆరోపించారు. అందుకోసమే పీఠాధిపతి వేషంలో బీజేపీ ఎమ్మెల్యేను కలిశానని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిత్రపక్షం అయినంత మాత్రానా నోర్మూసుకుని కూర్చోవాలా? : సుజనా చౌదరి కీలక వ్యాఖ్య