Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖ గురుకుల బాలికల కళాశాలలో ప్రిన్సిపాల్ వేధింపులు.. స్నానాల గదిని బాగుచేయిస్తానని?

విశాఖ గురుకుల బాలికల కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అదీ గిరిజన విద్యార్థినులను చిన్నచూపు చూస్తూ వారిని లైంగికంగా వేధించాడు.

Advertiesment
Visakapatnam
, బుధవారం, 1 మార్చి 2017 (13:37 IST)
విశాఖ గురుకుల బాలికల కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అదీ గిరిజన విద్యార్థినులను చిన్నచూపు చూస్తూ వారిని లైంగికంగా వేధించాడు. ఈ విషయం కాస్త ఎమ్మెల్యే చెవులకు వెళ్ళడంతో.. సదరు ప్రిన్సిపాల్‌పై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా, గూడెం కొత్తవీధిలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు.. అక్కడి విద్యార్థినులకు లైంగికంగా వేధించాడు. దీనిపై  కళాశాల విద్యార్థినులు, కాంట్రాక్ట్ మహిళా లెక్చరర్లు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మంగళవారం నాడు గూడెం కొత్తవీధిలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కాలేజీని సందర్శించారు. ఫిర్యాదుపై విద్యార్థినులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వేధింపులపై విద్యార్థినులు ఎమ్మెల్యేతో చెప్పేశారు. ఒంటరిగా ఉంటే.. ఎప్పటికైనా దొరక్కపోతానా అనే వారని.. స్నానాల గదుల్ని మరమ్మతు చేయిస్తానని.. తనతో హైదరాబాద్ వస్తారా.. నిర్ణయం మీదే అంటూ.. రోజూ వేధింపులకు గురిచేసే వాడని విద్యార్థినులు వాపోయారు. అస్వస్థతకు గురైనప్పుడు వైద్యుడిని సంప్రదించకుండానే బయటి మార్కెట్లలో దొరికే మందులు, ఇంజెక్షన్సు ఇస్తున్నారని, ఆర్ఎంపీ వైద్యులతో అనుమతి లేకుండా చికిత్స చేయిస్తున్నారని మండిపడ్డారు.  
 
ఇకపోతే.. కలెక్టరు ప్రవీణ్‌కుమార్‌, గురుకులం కార్యదర్శి, ఐటీడీఏ పీవో, గిరిజన సంక్షేమ శాఖ డీడీ దృష్టికి తీసుకెళ్లిన ఈ  విషయాన్ని ఎమ్మెల్యే ఈశ్వరి తీసుకెళ్లారు. ప్రిన్సిపాల్‌పై వారికి ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్‌ను తప్పించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేతులు లేకపోతేనేంటి? ఫోటోగ్రఫీ అతని హాబీ... మీరూ చూడండి (Video)