Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖలో దారుణం.. నడిరోడ్డులోనే టెక్కీ మృతదేహాలు

Advertiesment
Visaka
విశాఖ పట్నంలో దారుణం చోటు చేసుకుంది. విశాఖ లోని పిఏం పాలెం క్రికెట్ స్టేడియం వద్ద నడి రోడ్డు పై ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృత దేహాలు పడి ఉన్నాయి. గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఆ ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని .. దర్యాప్తు మొదలు పెట్టారు. ఆ ఇద్దరు ఐటీ ఉద్యోగులను మారిక వలస మధురవాడ ప్రాంతానికి చెందిన ధనరాజ్ ..వినోద్ గా గుర్తించారు పోలీసులు. 
 
వాహనం ఒక వైపు మృత దేహాలు మరో వైపు పడి ఉండడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అర్ధరాత్రి ఈ తర్వాత ఘటన జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా… కావాలనే… హత్య యత్నం చేశారా ? లేక… ఆక్సిడెంట్‌ కారణంగా ఆ ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి చెందారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిలటరీ విశ్రాంత ఉద్యోగిని మోసం చేసిన కిలాడీ నకిలీ డాక్టర్