ఏయ్ అమ్మాయ్.. నీది ఈ జిల్లాకాదు.. ఇక్కడెలా చదువుతావ్.. విద్యార్థినిని గెంటివేసిన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్!
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థినికి ఓ వింత పరిస్థితి ఎదురైంది. తాను ఏ జిల్లాకు చెందిన యువతినో అర్థం కావడం లేదు. దీంతో వికారాబాద్‌లోని సంఘం లక్ష్మీబాయి కస్తూర్బా గురుకుల పాఠశాల నుంచి గెంటివేతక
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థినికి ఓ వింత పరిస్థితి ఎదురైంది. తాను ఏ జిల్లాకు చెందిన యువతినో అర్థం కావడం లేదు. దీంతో వికారాబాద్‌లోని సంఘం లక్ష్మీబాయి కస్తూర్బా గురుకుల పాఠశాల నుంచి గెంటివేతకు గురైంది. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే...
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మనుమర్రికి చెందిన సౌమ్య అనే బాలిక రెండేళ్ల పాటు మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో చదువుకుంది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష రాయగా సీటు వచ్చినట్లు ఇంటికి లెటర్ పంపారు. జూన్ 18న వికారాబాద్ సంఘం లక్ష్మీబాయి పాఠశాలలో చేర్పించాను. కానీ నెల గడిచాక ఇప్పుడు ఆ బాలికది రంగారెడ్డి జిల్లా కాదనీ, పాలమూరు జిల్లా అని పాఠశాల ప్రిన్సిపాల్ వాదిస్తూ.. ఆ బాలికను స్కూలు నుంచి గెంటేశారు.
దీంతో ఆ బాలిక ఎటూ పాలుపోక ఆవరణలోని చెట్టు కింద దిగాలుగా కూర్చొనివుంది. స్థానిక జడ్పీటీసీ ముత్తహార్ షరీఫ్, మరికొందరు స్థానికులు అక్కడికి చేరుకొని గురుకుల సిబ్బందిని నిలదీశారు. విద్యార్థిని తల్లిదండ్రులు రాకముందే బయటకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పలేక ఉపాధాయ్యులు, ప్రిన్సిపాల్ నీల్లు నమిలారు.