Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుంటూరు కారంలో కల్తీ.. విజిలెన్స్ అధికారుల ఉక్కుపాదం.. కామినేని శ్రీనివాస్ సీరియస్

చిల్లీ ఉత్పత్తిలో గుంటూరుకు ఎంత పేరుందో అందరికీ బాగా తెలుసు. అయితే ఈ మధ్య గుంటూరు కారంలో కల్తీ చేరింది. గుంటూరులోని పలు శీతల గోదాముల్లో తనిఖీలు చేపట్టిన విజిలెన్స్ అండ్ ఆహార తనిఖీ అధికారులు భారీ సంఖ్య

Advertiesment
Vijulence officials : Raid on Fake Chili powder Mills in Guntur
, గురువారం, 24 నవంబరు 2016 (15:36 IST)
చిల్లీ ఉత్పత్తిలో గుంటూరుకు ఎంత పేరుందో అందరికీ బాగా తెలుసు. అయితే ఈ మధ్య గుంటూరు కారంలో కల్తీ చేరింది. గుంటూరులోని పలు శీతల గోదాముల్లో తనిఖీలు చేపట్టిన విజిలెన్స్ అండ్ ఆహార తనిఖీ అధికారులు భారీ సంఖ్యలో కల్తీకారం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో కల్తీ కారం మాఫియాపై గుంటూరు అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. 
 
డబ్బే ప్రధానంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై అధికారులు కేసులు నమోదు చేసుకుంటున్నారు. గుంటూరులోని శాంభవి గోదాములో 2,500 బస్తాలు, లక్ష్మీవల్లభ గోదాములో 4వేల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నకిలీ మిరప విత్తనాలు, కల్తీకి వినియోగించే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేగాకుండా వీటిని ల్యాబ్‌కు పంపంచారు. నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. 
 
ఈ నేపథ్యంలో కల్తీ ఉత్పత్తులు, నాణ్యత లేని ఆహార పదార్థాలను ప్రజలు సరఫరా చేస్తున్న గోదాములపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదాముల్లో అధికారులు మెరుపు దాడులు చేయాలని ఆదేశించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోట్ల‌పై జ‌గ‌న్ ఆల‌స్యంగా స్పంద‌న‌... వైఫ‌ల్య‌మా? వ్యూహాత్మ‌కమా?