Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజేపీలోకి కేశినేని నాని.. చంద్రబాబు బొమ్మ పడింది.. టాటా ఫోటో గోడెక్కింది..!

బీజేపీలోకి కేశినేని నాని.. చంద్రబాబు బొమ్మ పడింది.. టాటా ఫోటో గోడెక్కింది..!
, సోమవారం, 18 అక్టోబరు 2021 (10:40 IST)
టీడీపీ ఎంపీ కేశినేని నాని త్వరలో బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దేశం కోసం -ధర్మం కోసం బీజేపీ గూటికి కేశినేని నాని చేరబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కేశినేని నాని ఢిల్లీలోని ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల కేశినేని భవన్ పార్లమెంట్ కార్యాలయం లో జరిగిన కొన్ని మార్పులు కూడా అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. 
 
గతంలో కేశినేని ఆఫీసులో చంద్రబాబు బొమ్మలు కనిపించేవి. చంద్రబాబుతో కేశినేని నాని దిగిన ఫోటోలు కనిపించేవి.  అంతే కాదు. చంద్రబాబు మరియు ఏడు నియోజకవర్గాల  ముఖ్యనేతల  ఫోటోలు ఉండేవి.. ఇప్పుడు వాటిని తొలగించించేశారు. ఇప్పుడు కేశినేని పార్లమెంట్ ఆఫీసులో అవి మాయం కావడం కూడా చర్చనీయాంశమవుతోంది.
 
కార్యాలయం బయట గోడకు అమర్చిన చంద్రబాబు చిత్రపటాన్ని తాజాగా పీకేయించి, అదే స్థానంలో రతన్‌టాటాతో కలిసి ఉన్న తన ఫొటోను ఏర్పాటు చేశారు. కేశినేని భవన్‌ వెలుపల ఏర్పాటు చేసిన తన పార్లమెంటరీ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు, ఇతర ముఖ్య నాయకుల ఫొటోలను కూడా తొలగించేశారు. వాటి స్థానంలో టాటా ట్రస్టు, తన ఎంపీ నిధుల ద్వారా గతంలో చేసిన సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలతో కూడిన ఫొటోలను ఏర్పాటు చేసారు.
 
గతంలో రతన్ టాటాను విజయవాడకు తీసుకొచ్చిన కేశినేని నాని ఆయన ట్రస్టు ద్వారా తన నియోజకవర్గ పరిధిలో పలు కార్యక్రమాలకు ఒప్పించారు. ఇప్పుడు ఆయన ఫొటో పెట్టటం ద్వారా కేశినేని నాని సైతం సేవా కార్యక్రమాల వైపు మొగ్గు చూపుత్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. 
 
అదే విధంగా చంద్రబాబుతో సహా బెజవాడ టీడీపీ నేతలు ఫొటోలు సైతం తొలిగించటంతో ఇక వారితో దూరంగానే ఉండాలని నాని నిర్ణయించారా అనే చర్చ మొదలైంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అధినేత ఫొటో తొలిగించటం ఇప్పడు బెజవాడ పాలిటిక్స్ తో పాటుగా టీడీపీలో హాట్ టాపిక్ గా మారుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యాంకులకు ఫెస్టివల్ హాలిడేస్.. ఏకంగా 6 రోజులు సెలవులు