Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'బుడమేరు' గండి పూడ్చివేత పనులు.. రేయింబవుళ్లు శ్రమిస్తున్న మంత్రి రామానాయుడు (Video)

nimmala ramanaidu

ఠాగూర్

, శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (14:53 IST)
విజయవాడ నగరం జలదిగ్బంధంలో చిక్కుకోవడాని ప్రధాన కారణమైన బుడమేరు కరకట్టకు పడిన గండ్లను పూడ్చే పనిలో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు రేయింబవుళ్ళు శ్రమిస్తున్నారు. గుండ్లు పూడ్చే ప్రాంతంలోనే ఆయన ఉంటూ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆ ప్రాంతంలోనే కాలకృత్యాలు తీర్చుకుంటూ, అన్నపానీయాలు కూడా అక్కడే తీసుకుంటున్నారు. దీంతో ఈ గ్ండ్ల పూడ్చివేత పనులు క్షేత్రస్థాయిలో శరవేగంగా సాగుతున్నాయి. 
 
ముంపు నుంచి విజయవాడ నగరం తేరుకునేవరకూ తాను తిరిగి వెళ్లేది లేదంటూ వర్షంలోనూ కాల్వగట్లపైనే గడుపుతున్నారు. బుడమేరు మళ్లింపు కాలువకు మూడురోజుల క్రితం గండ్లు పడిన సంగతి తెలిసిందే. ఎడమగట్టు మూడుచోట్ల తెగిపోగా, కుడి గట్టుకు ఏడుచోట్ల గండ్లు పడ్డాయి. ఈ నీరంతా విజయవాడ నగరంతో పాటు దిగువనున్న గ్రామాల్లోకి, పంట పొలాల్లోకి పోటెత్తుతోంది. ఈ వరద నియంత్రణ చర్యలను బుధవారం నుంచే మంత్రి రామానాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 
 
గురువారం రాత్రికల్లా ఈలప్రోలు, కవులూరు వద్ద గండ్లకు మరమ్మతులు పూర్తయ్యాయి. ఆనక రాయనపాడు నుంచి సింగ్ నగర్ వైపు వరద పోటెత్తగా, ఆ ప్రాంతంలోని మూడు భారీ గండ్లను పూడ్చే పనుల్లో నిమగ్నమయ్యారు. నీళ్లు, బురద కారణంగా అక్కడికి వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో, సిబ్బందితో కలిసి నడిచి వెళ్లారు.
 
ఒకవైపు, జోరున వాన కురుస్తున్నా, వరద పోటెత్తుతున్నా, చీకట్లు కమ్ముకున్నా.. మంత్రి రామానాయుడు మాత్రం బుడమేరు కాల్వ గట్ల నుంచి కదలడం లేదు. కట్టపైనే భోజనం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు విజయవాడలో అధికారులతో సమీక్షిస్తుంటే, మంత్రి క్షేత్రస్థాయిలో కథనం రంగంలో ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన వెంటున్నారు. 
 
బుధవారం మంత్రి లోకేశ్ కూడా గండ్ల పూడ్చివేత పనులను పరిశీలించారు. 'విజయవాడ మునకకు కారణం బుడమేరు మళ్లింపు కాల్వకు గండ్లు పడటమే. వీటిని పూడ్చితేనే నగరానికి ఉపశమనం. దగ్గరుండి చేయిస్తేనే, ఏ పని అయినా త్వరగా అవుతుందన్నది ముఖ్యమంత్రి నమ్మకం. అదే స్ఫూర్తిని పాటిస్తున్నాను. అన్ని గండ్లు పూడ్చిన తర్వాతే నగరానికి వస్తానని మంత్రి రామానాయుడు చెప్పారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనా వెనక్కి.. ప్రపంచంలోనే అతిపెద్ద 5G హ్యాండ్‌సెట్ మార్కెట్‌‌గా భారత్