చిన్నారి అల్లరి చేసిందని.. ఆ తల్లి ఒంటినిండా వాతలు పెట్టింది...
చిన్నపిల్లలు అల్లరి చేయడం సర్వసాధారణం.. వారి అల్లరిని చూసి తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోతారు. కానీ ఓ తల్లి మాత్రం కర్కశంగా ప్రవర్తించింది. అల్లరి చేస్తుందనే సాకుతో కన్నబిడ్డను అత్యంత క్రూరంగా హింసించ
చిన్నపిల్లలు అల్లరి చేయడం సర్వసాధారణం.. వారి అల్లరిని చూసి తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోతారు. కానీ ఓ తల్లి మాత్రం కర్కశంగా ప్రవర్తించింది. అల్లరి చేస్తుందనే సాకుతో కన్నబిడ్డను అత్యంత క్రూరంగా హింసించింది. కనీస మానవత్వం మరిచి చిన్నారికి ఒంటినిండా వాతలు పెట్టింది ఈ ఘటన విజయవాడలో జరిగింది.
వివరాల్లోకెళితే... నగరంలోని పాతరాజరాజేశ్వరి వీధికి చెందిన అస్మాబేగంకు రెండున్నరేళ్ల పాప షర్మిల ఉంది. ఆ చిన్నారి అల్లరి చేసిందని వంటినిండా వాతలు పెట్టింది. దీంతో పాపకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే షర్మిల తండ్రి సాయంత్రం ఇంటికి రాగానే.. చిన్నారి పరిస్థితి చూసి నిర్ఘాంతపోయాడు.
చిన్నారి జరిగిన విషయం తన తండ్రికి చెప్పింది. దీంతో ఆయన తన భార్యపై కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లి అక్కడినుంచి పరారైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.