Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భర్త, భార్య వివాహేతర సంబంధాలు... భార్యతో ఆటోడ్రైవర్, చంపి సమాధి కట్టాడు...

వివాహేతర సంబంధం... ఆ కారణంగా జరుగుతున్న హత్యలు ఈమధ్య కాలంలో పెచ్చుమీరిపోతున్నాయి. విజయవాడలో వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళితే... విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీ దుర్గాప్రసాద్‌ అలియాస్‌ ఎలక్ట్రికల్ ప్రసాద్‌కు మరియమ్మకు

భర్త, భార్య వివాహేతర సంబంధాలు... భార్యతో ఆటోడ్రైవర్, చంపి సమాధి కట్టాడు...
, సోమవారం, 15 మే 2017 (15:56 IST)
వివాహేతర సంబంధం... ఆ కారణంగా జరుగుతున్న హత్యలు ఈమధ్య కాలంలో పెచ్చుమీరిపోతున్నాయి. విజయవాడలో వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళితే... విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీ దుర్గాప్రసాద్‌ అలియాస్‌ ఎలక్ట్రికల్ ప్రసాద్‌కు మరియమ్మకు పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు కలిగారు. ఇటీవలే తన కుమార్తె మరియమ్మను పిల్లల్ని చూసి వెళదామని రేపల్లె మరియమ్మ తల్లి విజయవాడకు వచ్చింది. 
 
ఐతే తన కుమార్తె, పిల్లలు కనిపించకపోయేసరికి... ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించింది. బంధువుల ఇంటికి వెళ్లిందంటూ చెప్పాడు. రోజులు గడిచిన తర్వాత కూడా అల్లుడు దగ్గర్నుంచి అదే సమాధానం వస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో వ్యవహారం అంతా బయటపడింది. పోలీసుల విచారణలో భార్యను చంపి ఇంటి వెనుక పూడ్చిపెట్టినట్లు ప్రసాద్ అంగీకరించాడు. దీనికి కారణం కూడా వెల్లడించాడు. తన భార్య మరియమ్మకు ఓ ఆటోడ్రైవరుతో అక్రమ సంబంధం వున్నదనీ, కొన్నిరోజుల క్రితం ఆమె తనను వదిలేసి అతడితో వెళ్లిపోయిందని తెలిపాడు. 
 
ఆ తర్వాత తను కూడా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్లు గడిచాక మరియమ్మ తిరిగి ప్రసాద్ వద్దకు వచ్చేసింది. ఆటో డ్రైవరుతో వేగలేక వచ్చేసినట్లు చెప్పడంతో తను అంగీకరించి ఇంట్లో వుండేందుకు ఒప్పుకున్నాడు. ఐతే మళ్లీ మార్చి నెలలో ప్రసాద్ బయట నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య మరియమ్మ, ఆటోడ్రైవర్ కలిసి సన్నిహితంగా కనబడ్డారు. దాంతో ఆమెతో ఘర్షణకు దిగాడు ప్రసాద్. ఆ క్రమంలో ఆమెను గొంతు నులిమి చంపి రెండ్రోజుల తర్వాత ఇంటి వెనుక గొయ్యి తవ్వి పూడ్చేసి సిమెంటుతో సమాధి కట్టేశాడు. కాగా, తమ కుమార్తె మరియమ్మను పొట్టనబెట్టుకున్న దుర్గాప్రసాద్‌ను శిక్షించాలంటూ బంధువులు ఆందోళన చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయోధ్య నిర్మాణానికి రూ.15 కోట్ల విరాళం.. ముస్లిం ఎమ్మెల్సీ ఆఫర్