Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఐను బండబూతులు తిట్టిన వీహెచ్- ఫేస్‌బుక్‌లో రాజీనామా లేక పెట్టేసిన?

కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు సీఐ పట్ల దురుసుగా వ్యవహరించారు. నోటికి పని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్దకు వెళ్తున్నప్పుడు సీఐ సుధాకర్ అడ్డుకోవడంతో తీవ్ర పదజాలంతో దూషణకు దిగారు.

Advertiesment
సీఐను బండబూతులు తిట్టిన వీహెచ్- ఫేస్‌బుక్‌లో రాజీనామా లేక పెట్టేసిన?
, శనివారం, 25 మార్చి 2017 (10:43 IST)
కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు సీఐ పట్ల దురుసుగా వ్యవహరించారు. నోటికి పని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్దకు వెళ్తున్నప్పుడు సీఐ సుధాకర్ అడ్డుకోవడంతో తీవ్ర పదజాలంతో దూషణకు దిగారు. నన్ను ఆపేందుకు నీవు ఎవడివి రా..? అంటూ బండబూతులు తిట్టారు. అయితే వీహెచ్ వ్యాఖ్యలకు తీవ్ర మనస్తాపానికి గురైన సీఐ.. తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు.
 
ఎస్సీ కులానికి చెందిన తనను వీహెచ్ కులం పేరుతో దూషించారని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లానని అయినా ప్రయోజనం లేకపోయిందన్నారు. తన సొంత శాఖలోనే తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 20ఏళ్ల సర్వీసులో ఎలాంటి ఆరోపణలు లేకుండా విధులు నిర్వహించానని, ఎప్పుడూ ఇలాంటి అవమానం జరుగలేదని ఆవేదన చెందారు.
 
ఇకపోతే సీఐపై వీహెచ్ ఓవరాక్షన్ ఘటన గురువారం జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మీడియాతో మాట్లాడేందుకు పాయింట్‌ వద్దకు వీహెచ్‌ రాగా, అందుకు అనుమతి లేదంటూ అక్కడ విధుల్లో ఉన్న కామాటిపుర అదనపు ఇన్‌స్పెక్టర్‌ పాములపర్తి సుధాకర్‌ అడ్డుకున్నారు. అంతే వీహెచ్‌ వీరంగం సృష్టించారు. విచక్షణ మరిచి ఇన్‌స్పెక్టర్‌పై విరుచుకుపడ్డారు. 
 
మీడియా పాయింట్‌ వద్ద ప్రస్తుత సభ్యులే మాట్లాడాలని, మాజీలకు అవకాశం లేదని, అందువల్ల వెళ్లిపోవాలని సుధాకర్‌ మర్యాదపూర్వకంగా చెప్పినా, వీహెచ్‌ ఏమాత్రం పట్టించుకోలేదు. కోపంతో ఊగిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌కు విజయ్ మాల్యా.. ఇక వారెంట్ జారీ చేయాల్సిందే తరువాయి..