విశాఖ పట్టణం నుంచి అరకుకు స్పెషల్ ట్రైన్ నడుపనున్నారు. ఈ రైలును ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర పర్యాటక మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
అరకకు వెళ్లే పర్యాటకుల కోసం విశాఖ నుంచి అరకు లోయకు రెండు విస్టా డోమ్ కోచ్‌లతో కూడిన రైలును ఏర్పాటు చేయగా, దీన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ రైలు విశాఖ - కిరండూల్‌ల మధ్య నడుస్తుంది. ఈ రైలును ఉపరాష్ట్రపతి వెంకయ్య మంగళవారం విశాఖ రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబరు ఫ్లాట్‌ఫాంపై ప్రారంభించారు.
ఈ కార్యక్రమలో మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ, ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకు పర్యాటక అందాలను తిలకించేందుకు వెళ్లే పర్యాటకుల కోసం ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పర్యాటక పరంగా ప్రభుత్వం అనేక రకాలైన సౌకర్యాలను అందుబాటులోకి తెస్తుందని ఆయన వెల్లడించారు. పర్యాటకులు కూడా ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవాలని కోరారు.